శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 17, 2020 , 06:48:15

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహేశ్వరం : దవాఖాన నుంచి డిశ్చార్జిఅయి ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.  ఈ సంఘటన మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి  వివరాల ప్రకారం..  వెల్దండ మండలం, బొల్లంపల్లి గ్రామానికి చెందిన మారి జంగమ్మ (70), రాజమోని ఆనంద్‌( 28)లు కొత్తపేట సాయి సంజీవిని దావాఖాన నుంచి డిశ్చార్జి అయి అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరారు. కొత్తూరు గేట్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన స్విఫ్ట్‌ డిజైర్‌ అంబులెన్స్‌ను  ఢీకొట్టింది. ఈ ఘటనలో జంగమ్మ,  ఆనంద్‌ అక్క డికక్కడే మృతి చెందగా, అందులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచా రం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.   ఈ మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.