సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Nov 17, 2020 , 04:27:23

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యం

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యం

  • నాణ్యమైన వైద్యం అందించేందుకు  విస్తృత చర్యలు
  • అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల రాజేందర్‌
  • చేవెళ్ల, పరిగిలో దవాఖానలు వికారాబాద్‌, చేవెళ్లలో అంబులెన్స్‌లు ప్రారంభం 

సర్కారు దవాఖానల్లో ప్రైవేటుకు దీటుగా మెరుగైన వైద్యం అందుతున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయన సోమవారం చేవెళ్ల, పరిగిలో దవాఖానలను,  ఎంపీ  రంజిత్‌రెడ్డి నిధులతో ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా అందజేసిన అంబులెన్స్‌లను  ప్రారంభించారు. వికారాబాద్‌లోనూ నిర్మా ణం పూర్తయిన దవాఖానను పరిశీలించి, అంబు లెన్స్‌ను ప్రారంభించారు.   ఈ  సంద ర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పేదల వైద్యం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదన్నారు. దీర్ఘకాలిక రోగాల  చికిత్స కోసం  ప్రత్యేక దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  ఈ కార్యక్రమాలలో రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి,  ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, డాక్టర్‌ ఆనంద్‌,  డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. -చేవెళ్ల, పరిగి, ధారూర్‌

పరిగి: ప్రజారోగ్యంపై  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆరోగ్య, జ్ఞానవంతమైన తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. సోమవారం పరిగిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన 30 పడకల దవాఖాన భవనాన్ని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ జీ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిలతో కలిసి మంత్రి ఈటల  ప్రారంభించారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ  ఏర్ప డిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరించామని, మరికొన్నింటిని పరిష్క రించాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం ప్రభు త్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు బడ్జెట్‌ కేటాయింపులలో తగ్గించగా, తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెట్టింపు బడ్జెట్‌ కేటాయింపులు చేసిందని తెలిపారు. గర్భిణీలకు గతంలో నెలలో 15 కోడిగుడ్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 30 కోడిగుడ్లు అంద జేసిందన్నారు.

 కేసీఆర్‌ కిట్‌లతో సర్కారు దవాఖానలలో ప్రసవాలు పెరి గాయని, కేసీఆర్‌ కిట్‌లో మానవత్వం, మనిషి జీవితం ఉందన్నారు. తల్లి గారు, అత్తగారు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సర్కారు దవాఖా నలలో ప్రసవం అనంతరం కేసీఆర్‌ కిట్‌లు అందించడంతోపాటు ఆడశిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలు సర్కారు అందిస్తుం దని మంత్రి తెలిపారు. ఇంట్లో డయాలసిస్‌, తలసేమియా, పక్షవాతం రోగు లు ఉంటే ఆ కుటుంబం అంధకారంలో ఉంటుందని, పేదలకు ఎలాంటి ఇబ్బంది ఉండరాదనే దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పరిగిలో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దవాఖానలో డయాలసిస్‌ రోగుల సంఖ్య ఆధారంగా పరిగి దవాఖానలో డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ఈటల వివరించారు. పరిగిలో దవాఖాన స్థాయి సరిపడ డాక్టర్లు, సిబ్బంది నియామకం చేపడతా మని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం అవసరమైన మేరకు నిధులు ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేటు దవాఖానలు మూతపడిన నేపథ్యంలో సర్కారు వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా మహమ్మారి నివారణకు బాధ్యతగా పనిచేశారని మంత్రి అభినందించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 5 అంబులెన్స్‌లు ఇచ్చారని, మరో 5 అంబులెన్స్‌లు ఇప్పించాలని మంత్రి సూచించారు. ప్రత్యేకంగా వైద్యులను నియమించి చికిత్సలు చేస్తా మనడం అభినందనీయమని చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ జీ.రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ తాను అందజేసిన అంబులెన్స్‌లలో ప్రత్యేకంగా డాక్టర్‌లను నియమించి, గ్రామాలలో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారిని కుటుంబసభ్యులు పట్టించుకోవడం లేదని, అలాంటి వారికి తామున్నామని సర్కారు భరోసా కల్పిస్తూ ప్రత్యేక దవాఖానలు ఏర్పా టు చేస్తుందన్నారు.

 పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సర్కారు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రత్యేక శ్రద్ధతో పనిచే శారని ఆయన కొనియాడారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లా డుతూ పరిగి ప్రాంతంలో 90శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తు న్నారని, ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాల కల్పనలో సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. పరిగిలో 30 పడకల దవాఖాన ఉండగా, అదనంగా 50 పడకల దవాఖాన మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి 12వేల పోస్టుల నియామకానికి చర్యలు తీసుకుంటుందని, తద్వారా పరిగి దవా ఖానలోని అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 

కొత్త భవనం అందుబాటులోకి రావడం ద్వారా పేదలకు మరింత నాణ్యమైన, ఇతర వైద్య సేవలు అందు బాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా దవాఖాన భవనాన్ని ప్రారం భించిన అనంతరం సదుపాయాలను మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలిం చారు. దవాఖాన ఆవరణలో మొక్కలు నాటారు. కేసీఆర్‌ కిట్‌లను బాలిం తలకు అందజేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి పరిగి నియోజకవర్గానికి ఇప్పించిన అంబులెన్స్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల ఎంపీపీలు కె.అరవిందరావు, అనసూయ, మల్లేశం, సత్యమ్మ, పరిగి జెడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజహ రుద్దీన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ షిండే, జిల్లా సర్వేలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరవింద్‌, జిల్లా మెటర్నిటీ, చైల్డ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లలిత, పరిగి దవాఖాన ఇన్‌చార్జీ డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌లు ప్రవీణ్‌, వైదేహీ, టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

చేవెళ్లలో పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌.. 

చేవెళ్ల/ చేవెళ్ల రూరల్‌ : పేదల ప్రజలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల  పేర్కొన్నారు. సోమవారం ఎంపీ రంజిత్‌ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌తో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి సొంత నిధులతో మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల  మాట్లాడుతూ భారత దేశంలోనే కొత్త కొత్త కార్యక్రమాలకు రూప కల్పన చేసి వైద్య రంగంలో అనుభవం కలిగిన తమిళనాడు, కేరళ రాష్ర్టాల సరసన తెలంగాణ రాష్ట్రం కూడా చేరిందని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలకు గుడిసెలో ఉన్న వారు, బంగ్లాలో ఉన్నవారు అనే తేడా ఉండదని మంత్రి అన్నారు. రోగులను బట్టి చేవెళ్లలో డయాలాసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్‌ ఎ స్మైల్‌ అంబులెన్స్‌లు ఇక వైద్యుడు లేదా పారా మెడికర్‌ సిబ్బందితో పాటు ఒక అటెండర్‌ ఉండి వైద్య సేవలు అందించనున్నట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ డేటాను సేకరించి వారికి అవసరమైన అన్ని చికిత్సలు అందిస్తూ ఆరోగ్య పార్లమెంటరీ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ. పాలియేటివ్‌ కేర్‌తో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మద్దెల శివనీల చింటూ, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, చేవెళ్ల సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.