మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Nov 16, 2020 , 04:02:34

తెగిన గండ్లకు దిద్దుబాటు చర్యలు

తెగిన గండ్లకు దిద్దుబాటు చర్యలు

ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు గండ్లు పడిన చెరువు, కుంటల మరమ్మతు పనులకు ఇరిగేషన్‌ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో గండ్లు పడిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను గుర్తించారు. మొత్తం 60చెరువులు, కుం టలు, చెక్‌డ్యాంలకు గండ్లుపడ్డాయి. వీటి మరమ్మతు కోసం ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగానే ప్రభుత్వం తాత్కాలిక మరమ్మత్తులకు నిధులు కేటాయించింది.  

శరవేగంగా తట్టిఖానా చెక్‌డ్యాం మరమ్మతు

ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా మరమ్మతు పనులు అధికారులు శరవేగంగా చేపడుతున్నారు. వర్షాలు కురువకపోయినప్పటికీ తట్టిఖానా చెక్‌డ్యాంలో సమృద్ధిగా నీరుండేది. ఇటీవల చెక్‌డ్యాం ఎగువ భాగంలో ఉన్న ఫిరంగినాలా కాల్వకు గండ్లు పడటంతో ఆ నీరంతా పులిందర్‌వాగులో ఉన్న చెక్‌డ్యాంగుం డా ప్రవహించింది. పెద్దఎత్తున వచ్చిన వరదనీటితో తట్టిఖానా చెక్‌డ్యాంకు భారీ గండిపడింది. దీనికి వెంట నే తాత్కాలిక మరమ్మతు చేయడానికి అధికారులు మూడు లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ముందుగా గండిని పూ డ్చారు. అనంతరం తెగిపోయిన గండిని పూర్తిస్థాయిలో మరమ్మతు చేశారు. దీంతో తట్టిఖానా చెక్‌డ్యాం నుంచి వృథాగా పారుతున్న నీటికి అడ్డుకట్ట పడినట్లయ్యింది. అలాగే, రాయపోల్‌, దండుమైలారం, పోల్కంపల్లి గ్రామాలతో పాటు యా చారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లోని చెరువులు, కుంటల తాత్కాలిక మరమ్మతులు సాగుతున్నాయి. 

ఫిరంగినాలా గండ్ల వలన చెరువుకు చేరని నీరు..

ఫిరంగినాలాకు సరైన మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫిరంగినాలా మరమ్మతు చేపట్టినట్లయితే వర్షపునీరు వృథాగా పో కుండా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు చేరేది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిబట్ల, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, బొంగ్లూరులో ఫిరంగినాలాకు గండ్లు పడ్డాయి. 

శాశ్వత మరమ్మతులకు ప్రతిపాదనలు : పరమేశ్‌, ఇరిగేషన్‌ డీఈ 

నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతులకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నియోజకవర్గంలో 60చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు వర్షాలకు గండ్లు పడ్డాయి. వీటి శాశ్వత మరమ్మతుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు రాగానే పనులు చేపడుతాం.