శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Rangareddy - Nov 16, 2020 , 03:58:38

మెథడిస్టు జాతర రద్దు

మెథడిస్టు జాతర రద్దు

ధారూరు: ప్రతి ఏటా నవంబర్‌ రెండవ వారంలో నిర్వహించే ధారూరు మెథడిస్టు జాతర కరోనా వైరస్‌తో ఈసారి నిర్వాహకులు రద్దు చేశారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని స్టేషన్‌ ధారూరు-దోర్నాల్‌ గ్రామాల మధ్య ఉన్న కాగ్నా నదీ సమీపంలో ప్రతి ఏటా నిర్వహించే మెథడిస్టు జాతరను నిర్వాహకులు రద్దు చేశారు. జాతర రద్దుతో ప్రతి ఏటా లక్షల్లో ఉండే యాత్రికుల సంఖ్య వందలో ఉంది. ధారూరు మెథడిస్టు జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాక ఇతర రాష్ర్టాల, ప్రాంతాల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుండేవారు. గత సంవత్సరం 6లక్షలకు పైగా యాత్రికులు ధారూరు మెథడిస్టుకు తరలివచ్చారు. ఈసారి కరోనా వైరస్‌వ్యాధి వ్యాపిస్తుండడంతో జాతరను నిర్వాహకులు రద్దు చేశారు. జాతర రద్దు చేసినా యాత్రికులు వందల సంఖ్యలో వచ్చి సిలువ వద్ద ప్రార్థనలు చేశారు. జాతరకు వచ్చిన యాత్రికులు కొవ్వొత్తులు వెలిగించి సిలువ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

VIDEOS

logo