ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Nov 16, 2020 , 03:54:08

బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి

 బ్యాంకు అభివృద్ధికి  నిరంతరం కృషి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : డీసీసీబీ బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లా డీసీసీబీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతనం దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకు సిబ్బందితో కలిసి బ్యాంకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ లక్ష్మీపూజ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీసీబీ బ్యాంకును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బ్యాంకుల ద్వారా రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రైతులు సహకార సంఘాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, డైరెక్టర్లు అంజిరెడ్డి, రాంరెడ్డి, సిబ్బంది తదితరులున్నారు.