గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Nov 16, 2020 , 03:51:14

కష్టకాలంలో గొప్ప నిర్ణయం

కష్టకాలంలో  గొప్ప నిర్ణయం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : కరో నాతో ఆర్థిక ఇబ్బందులు, వరదల సంక్షోభంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసు కున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలకు ఈ కష్టకాలంలో ఊరట కల్పించే నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్య క్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మా ట్లాడుతూ...ఒకవైపు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు హైదరాబాద్‌ నగరాన్ని ముం చెత్తిన వరదలతో ఎటు తోచని స్థితిలో నగర జీవి సతమతమవుతున్న వేళ ప్రభుత్వం ప్రజలకు దీపావళి పర్వదినాన తీపి కబురు అందించిందని, రూ. 15వేల లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న మధ్య తరగతి ప్రజలకు 50 శాతం రాయితీ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. 

ఈ నిర్ణయంతో జీహెచ్‌ ఎంసీ పరిధిలోని 13.72లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దాంతో పాటు తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా రూ. 10వేల వర కు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి కూడా 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 2020-21 సంవత్సరానికి గాను ఈ రాయితీ వర్తిస్తుందని, ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే సంవత్సరం వర్తిస్తుందన్నారు. ఈ రాయితీ వల్ల ప్రభుత్వంపై ఒక్క హైదరాబాద్‌లోనే రూ. 196.48కోట్ల భారం పడుతున్న పేదల కష్టాలు దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 31.40 లక్షల కుటుంబాలకు రూ. 326.48కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. వరదలతో  ఆతలాకుతలమైన ప్రజ ల కోసం రూ. 550 కోట్లు ప్రభుత్వం కేటా యిం చిందని, ఇందులో ఇతర పనుల కోసం రూ. 50కోట్లు వెచ్చించగా 4,75,871 కుటుంబాలకు రూ. 475 కోట్లు సహాయంగా అందించిన్నట్లు చెప్పారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న మరి కొందరి కోసం కూడా తాజాగా నిర్ణయం తీసు కోవడం జరిగిందన్నారు. 

అకాల వర్షాలకు నీరు ఇండ్లల్లో చేరి ఇంకా వరద సాయం అందని అర్హులకు మీ-సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీ ఆర్‌కు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వరద సాయం అందని అర్హులైన వారందరూ  దగ్గర్లోని మీ-సేవా సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు. ఇప్పటికే రెండు సార్లు వేతనాలు పెంచిన జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి దీపావళి కా నుకగా రూ. 3వేలు పెంచి జీతాన్ని రూ. 14,500 నుంచి రూ. 17,500 జీతం పొందేలా, వారి జీవి తాలలో వెలుగు నింపిన మహానీయులు సీఎం కేసీఆర్‌ అని చెప్పా రు. కరోనా కాలంలో వారి యర్స్‌గా పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు వారి పనితనానికి లభించిన గౌరవంగా భావించాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్న 22వేల మంది కార్మికులు దీని ద్వారా లబ్ధిపొందనున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఆలోచిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని, అదే స్పూర్తితో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిరం తరం పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.