మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Nov 14, 2020 , 03:39:39

బాలల జీవితాల్లో వెలుగులు నింపాలి

బాలల జీవితాల్లో వెలుగులు నింపాలి

రంగారెడ్డి  : నేటి బాలలే రేపటి పౌరులని జిల్లా అదనపు కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్‌ 1098పోస్టర్‌ను శుక్రవారం రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం చైల్డ్‌లైన్‌ 1098నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం బాలల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి మోతి మాట్లాడుతూ.. ఇంట్లో నుంచి ఆడ పిల్లలను చిన్ననాటి నుంచి వారిని వివక్షత నుంచి కాపాడి వారికి సమాజంలో పురుషులతో సమానంగా చూడాలన్నారు. ఆడ పిల్లలకు చిన్న వయస్సులో బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా 

నేరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఆడ పిల్లల జీవితాన్ని సమాజంలో అందనంత ఎత్తుకు ఎదిగేలా చూడాలన్నారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయస్సు నుంచి పోషకాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ నరేశ్‌, సౌజన్య, టీం సభ్యులు తిరుమల్‌రావు, నర్సింహ, శ్యా మ్‌, అనూష, శ్వేత, సంధ్యారాణి ఉన్నారు.