శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 13, 2020 , 03:38:20

దేశం చూపు.. చందనవెల్లి వైపు..

దేశం చూపు.. చందనవెల్లి వైపు..

  • భారీ పరిశ్రమలతో మరింత అభివృద్ధి
  • ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
  • రూ. 2కోట్లతో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ అభివృద్ధి 
  • ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి
  • కొలువుదీరిన సర్దార్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం.. 
  • చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పొన్న స్వప్నానర్సింహారెడ్డి 

షాబాద్‌ : దేశం మొత్తం చందనవెల్లి వైపు చూస్తున్నదని... పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌ మండలంలోని సర్దార్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి చేవెళ్ల, కొడంగల్‌ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ హాజరయ్యారు. ముందుగా నూతన చైర్‌పర్సన్‌గా స్వప్నానర్సింహారెడ్డితో పాటు వైస్‌ చైర్మన్‌ డప్పు రాజు, డైరెక్టర్లు సూద యాదయ్య, రుక్మొద్దీన్‌, వెంకట్‌రెడ్డి, మంజుల, బాల్‌రాజ్‌, ఆంజనేయులు, ట్రేడర్స్‌గా నాగభూషణం, పెంటయ్యలతో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రవికుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ...జిల్లాలోనే సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీకి మంచి పేరుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని మార్కెట్‌ కమిటీల్లో గోదాముల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

 చందనవెల్లిలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో టీఎస్‌ఐఐసీ ద్వారా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. ఇప్పటికే నిర్మాణం చేసిన టెక్స్‌టైల్స్‌ పార్కులో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇక్కడి టెక్స్‌టైల్స్‌ పార్కులో తయారైన వస్తువులు ఇతర దేశాలకు సరఫరా అవుతుండడంతో దేశం మొత్తం చందనవెళ్లి వైపు చూస్తున్నదన్నారు. ఎలక్ట్రికల్‌ వాహనాలు, సినిమా షూటింగ్‌ల వస్తువులు ఇక్కడే తయారు కానున్నట్లు ఆయన తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఐటీమంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్‌రెడ్డిల కృషితో ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడం జరిగిందన్నారు. శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉన్న షాబాద్‌ మండలం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులెవ్వరూ భూములు అమ్ముకోవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ...రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రూ. 2కోట్లతో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.  అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా రుణపడి ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు  కోట్ల ప్రశాంతి, గునుగుర్తి నక్షత్రం, మండల వైస్‌ ఎంపీపీ  లక్ష్మీరాజేందర్‌గౌడ్‌, పీఏసీఏస్‌ చైర్మన్‌ చల్లా శేఖర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఏల్‌ఎఫ్‌ జిల్లా లీగల్‌ అడ్వైజర్‌ పీసరి సతీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కోట్ల మహేందర్‌రెడ్డి, శేరిగూడెం వెంకటయ్య, పొన్న నర్సింహారెడ్డి, జీవన్‌రెడ్డి, కౌకుంట్ల రాజేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూర్‌ నర్సింగ్‌రావు, చల్లా శ్రీరాంరెడ్డి, సర్పంచ్‌  స్వరూప, ఎంపీటీసీలు వనిత, కరుణాకర్‌, మధుకర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దర్శన్‌, శేఖర్‌రెడ్డి, రాజుగౌడ్‌, ఆశోక్‌గౌడ్‌, దేవేందర్‌రెడ్డి, గోపాల్‌, కృష్ణారెడ్డి, ఈదుల కృష్ణగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, యాదిరెడ్డి, ఇనాయత్‌, కారు చెన్నయ్య, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, జంగయ్య, దయాకర్‌చారి, రాంచంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముఖ్రంఖాన్‌, మునీర్‌ పాల్గొన్నారు.