గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Nov 12, 2020 , 04:53:45

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

శంషాబాద్‌ రూరల్‌ : “గ్రామాలను అన్ని రంగాల్లో  అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతోనే పల్లెలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని” రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.  బుధవారం శంషాబాద్‌ మండలంలో 65 లక్షల రూపాయలతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలుగా  భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామా లల్లో మౌలిక సదుపాయలకు తీసుకుంటున్న చర్యలు జాతీయస్థాయిలో మంచి గుర్తింపువస్తుందని వివరించారు. గ్రామ యువత ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా చిన్నచిన్న వ్యాపారులు చేస్తు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని  వివరించారు. శంషాబాద్‌ జడ్పీటీసీ నిరాటి తన్విరాజు కోరిక మేర కు మండలానికి 65 లక్షల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

నానాజీపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు, ప్రభుత్వ పాఠశాల ప్రహారికి అవసరమైన నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ... గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో గ్రామాలు ఎలా ఉండేవి, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏవిధంగా ఉన్నాయో ప్రజలు అలోచించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో  జిల్లా పరిషత్‌ సీఈవో దిలీప్‌కుమార్‌, 0ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటి తన్విరాజు,సర్పంచ్‌లు రమేశ్‌యాదవ్‌, సునిగంటి సిద్ధులు, రాజ్‌కుమార్‌, దండుఇస్తారి, కల్పనాసింహరెడ్డి, మాధవి,ఎంపీటీసీ క్రాంతికుమార్‌,టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి,నీరటి రాజు ముదిరాజ్‌, మాజీ ఎంపీటీసీ లతశ్రీనివాస్‌,పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌,మంచర్ల మోహన్‌రావు, డైరక్టర్‌ శివాజీ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.