శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Nov 12, 2020 , 04:49:52

డివిజన్‌ను అభివృద్ధి చేస్తాం

డివిజన్‌ను అభివృద్ధి చేస్తాం

ఆర్కేపురం, నవంబర్‌ 11 : ఆర్కేపురం డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆర్కేపురం డివిజన్‌ మార్గదర్శి కాలనీలో రూ.76 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, కాలనీలోని సీనియర్‌ సిటిజన్‌ భవనాన్ని ప్రారంభించారు. అదే విధంగా  సౌభాగ్యపురం కా లనీలోని ఫుట్‌పాత్‌ పనులకు శంకుస్థాపన చేశారు. హరిపురి కాలనీలో రూ.91 లక్షలతో సీసీ రోడ్డు పనులకు , రూ.11.25 లక్షలతో మహిళా భవన్‌ మొదటి అంతస్తు నిర్మాణ పనులకు కార్పొరేటర్‌ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఒక వేళ నాణ్యత లోపిస్తే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో రాజీపడేదిలేదని, నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పా ర్కుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. కాలనీల్లో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కా లనీ వాసులు పర్యవేక్షించి పను ల్లో నాణ్యతా లోపించకుండా చూసుకోవాలని సూచించారు. 

కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని, ఆర్కేపురం డివిజన్‌లోని ప్రతి కాలనీలో దశలవారీగా మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ప్రతిఫలం ఉంటుందని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామ్‌నర్సింహాగౌడ్‌, డివిజన్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పెండ్యాల గణేశ్‌, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌, నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ మహిళా వర్కింగ్‌ అధ్యక్షురాలు పటేల్‌ సునీతారెడ్డి, నాయకులు పెంబర్తి శ్రీనివాస్‌, శైలజారెడ్డి, ఊర్మిలారెడ్డి, మారం సుజాతారెడ్డి, రాములు యాదవ్‌, సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.