శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Nov 10, 2020 , 03:14:22

దేశానికే బువ్వ పెట్టే స్థాయిలో తెలంగాణ

దేశానికే బువ్వ పెట్టే స్థాయిలో తెలంగాణ

ఆమనగల్లు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన హరితవిప్లవం కారణంగా దేశానికి బువ్వపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. సోమవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఆవరణలో సీసీఐ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మక్క, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రైతులకు ఇక్కడ అందుతున్నాయని గుర్తు చేశారు.   రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. అంతకు ముందు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ఛాయాదేవి స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌, వంగేటి లక్ష్మారెడ్డి, ఫ్యాక్స్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌, ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్‌, అనిత, నిర్మల, జడ్పీటీసీ ఉప్పల్‌ వెంకటేశ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ సత్యం, నాయకులు గిరి, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి శ్రీశైలం, సింగిల్‌విండో కార్యదర్శి దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.