బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Nov 08, 2020 , 04:01:21

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

హయత్‌నగర్‌ : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇబ్రహంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, ఎంపీపీ బూర రేఖ మహేందర్‌ గౌడ్‌, జడ్పీటీసీ బింగి దేవదాస్‌ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నదన్నారు.  దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు.  ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ కందాల బలదేవ రెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకారం సంఘం చైర్మన్‌ లెక్కల విఠల్‌ రెడ్డి, సర్పంచ్‌ తుడుం మల్లేష్‌, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయస్థాయిలో మార్కెట్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌: బాచారం-బండరావిరాల గ్రామాల్లో వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా రైతుబంధు చైర్మన్‌ వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖమహేందర్‌గౌడ్‌, జడ్పీటిసి బింగి దాస్‌గౌడ్‌, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ లెక్కల విఠల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పట్నం నియోజకవర్గంలో కూరగాయలు, పండ్ల మార్కెట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. అందుకు 3 వందల ఎకరాల స్థలాన్ని  గుర్తించినట్టు తెలిపారు.  కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ కొత్త కిషన్‌గౌడ్‌, మండల కో ఆప్షన్‌సభ్యుడు ఎండీ గౌస్‌పాష, సర్పంచ్‌లు పారంద సంతోష, కవాడి శ్రీనివాస్‌రెడ్డి, సూరకంటి వనజశ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటీసీలు దంతూరి అనితమహేందర్‌గౌడ్‌, చేగూరి వెంకటేశ్‌, ఉపసర్పంచ్‌లు స్వామి, శేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ డైరక్టర్లు  సత్యనారాయణ, జైపాల్‌రెడ్డి,  భరత్‌కుమార్‌, జి శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి, నర్సింహ, రాములు, మైపాల్‌రెడ్డి, నాయకులు పూజారి చక్రవర్తిగౌడ్‌, నోముల జగదీష్‌, ఎన్‌ జంగమయ్య, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌గౌడ్‌, తాటిపల్లి నవీన్‌గౌడ్‌, ఉమాకాంత్‌చారి, పన్నీరు రాజేష్‌, శేఖర్‌, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.