గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 05, 2020 , 02:48:55

సీసీ రోడ్లను వెంటనే ప్రారంభించాలి

సీసీ  రోడ్లను వెంటనే ప్రారంభించాలి

  • వికారాబాద్‌ జడ్పీ సీఈవో ఉష

ధారూరు: మండల పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లను త్వరగా ప్రారంభించాలని వికారాబాద్‌ జిల్లా జడ్పీ సీఈవో ఉష అన్నారు. బుధవారం మండల పరిధిలోని స్టేషన్‌ ధారూరు గ్రామాన్ని సందర్శించారు. అంతకు ముందు మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించి మండల కార్యాలయానికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ మండల పరిధిలోని సీసీ రోడ్లకు ప్రొసిడింగ్‌ ఇచ్చిన అన్ని గ్రామాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపారు. 2018 సంవత్సరం నుంచి ప్రొసీడింగ్‌ తీసుకొని పనులు ప్రారంభించని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేగంగా జరుగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, ఎంపీడీవో అమృత, ఏఈపీఆర్‌ రాంబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.