గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Nov 05, 2020 , 02:48:57

ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కోసం స్థల పరిశీలన

ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కోసం స్థల పరిశీలన

పరిగి/పూడూరు: పరిగి మండలం రంగాపూర్‌ సమీపంలో నూతనంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు బుధవారం జిల్లా ఎస్పీ నారాయణ స్థలం పరిశీలించారు. తాసిల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డితో కలిసి స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించి, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి అనువైన స్థలంగా పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కనే స్థలం ఉండడంతో మరింత మేలు కలుగుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అంతకుముందు పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయం సముదాయం ఆవరణలో నిర్మాణంలో గల భవనాన్ని డీఎస్పీ కార్యాలయం కోసం ఎస్పీ పరిశీలించారు. భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం చేపడితే డీఎస్పీ కార్యాలయం కోసం బాగుంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ లక్ష్మిరెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ 

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులలో ఎలాంటి కేసులు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆయా కేసుల వివరాలను డీఎస్పీ, శ్రీనివాస్‌, సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై భీమ్‌కుమారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిం చాలని సూచించారు.  

రెడ్‌క్రాస్‌ సోసైటీ సేవలు అభినందనీయం

వికారాబాద్‌: రెడ్‌ క్రాస్‌ సోసైటీ సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ నారా యణ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్‌క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో టుగెదర్‌ వి కెన్‌ ఓవర్‌ కమ్‌ కొవిడ్‌19 కార్యక్రమం నిర్వ హించారు.  ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నారాయణ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో రెడ్‌ క్రాస్‌ సోసైటీ సేవలను కొనియాడారు. రక్తదాన శిభిరాలు, నిత్యవసరాల పంపిణీపై అభి నందించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రెడ్‌ క్రాస్‌ సోసైటీ ముందు వరుసలో ఉంటుందన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని నిర్లక్ష్యంగా ఉండ కుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్‌క్రాస్‌ సోసైటీ సభ్యులతో కలిసి పోలీస్‌ సిబ్బందికి సబ్బులను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ అచ్చుతరావు, పోలీస్‌ సిబ్బంది, రెడ్‌క్రాస్‌ సభ్యులు సాయి చౌదరి, సత్యనారాయణ, భక్తవత్సలం పాల్గొన్నారు.