శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Nov 04, 2020 , 04:19:54

రైతులకు ఇబ్బందులు జరగకుండా ధాన్యం సేకరణ చేయాలి

రైతులకు ఇబ్బందులు జరగకుండా ధాన్యం సేకరణ చేయాలి

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా వరి ధాన్యం సేకరణ చే యాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మార్కెటింగ్‌ శాఖ అధికారి ఛాయాదేవి, పౌరసరఫరాల అధికారి రాథోడ్‌, సీసీఐ అధికారులు హాజరైన సమావేశంలో వరి, పత్తి, మక్కజొన్న సేకరణపై జిల్లాలోని సీసీఐ, ఏడీఏ, ఏవో, ఏవోలతో ధాన్యం సేకరణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రైతు పండించిన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రిజిస్టర్‌ పట్టికను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా  ధాన్యం సేకరణ చే యాలని సూచించారు. అనంతరం కనీస మద్దతు ధర 2021 పోస్టర్‌ విడుదల చేశారు.