శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Nov 03, 2020 , 03:58:17

సంక్షోభంలోనూ సంక్షేమం

సంక్షోభంలోనూ సంక్షేమం

  • కరోనా  కష్టకాలంలోనూ అన్ని పథకాలకు నిధులు మంజూరు
  • మేనమామలాగా సీఎం కేసీఆర్‌ ఆడబిడ్డల పెండ్లికి ‘కల్యాణ లక్ష్మి’ పేరిట డబ్బులిస్తున్నారు
  • దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవు
  • ముంపు ప్రాంతాల వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాం..
  • మన పథకాలు దేశానికే ఆదర్శం 
  • బడంగ్‌పేటలో చెక్కుల  పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి
బడంగ్‌పేట: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుం డా కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను అంద జేస్తున్నట్టు  విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్‌ మండలంలోని బడంగ్‌పేట  పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో మంత్రి చేతు ల మీదగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ రేషన్‌ పరిధిలో169 మందికి, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 104 మందికి, జెల్‌పల్లిలో 264 మందికి చెక్కులను  అందజేశా రు. బాలాపూర్‌ మండలంలో  537 మందికి చెక్కులను అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలాపూర్‌ మండలంలోనే  ఇప్పటి వరకు  1640  మందికి షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశామన్నారు.  రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా సీఎం కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను, సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. 
సంక్షేమ పథకాలు ఆగిపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడుతారని ముఖ్యమంత్రి ఆలోచన చేశారన్నారు. అప్పులు చేసి పెండ్లి చేస్తున్న వారికి కల్యా ణ లక్ష్మి ఒక వరంలా ఉపయోగపడుతుందన్నారు. కేసీఆర్‌ మేనమామగా ఆడబిడ్డల పెండ్లిలకు చేయూత నిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాం టి పథకాలు లేవని,  చాలా రాష్ర్టా లో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి వారి రాష్ర్టాలలో పెట్టాలని చూస్తున్నారని మంత్రి సబితారెడ్డి వివరించారు. 
 వరద ముంపు ప్రాం తాలలో ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు త్వం చేయూతనిస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామన్నారు.   కేసీఆర్‌ మనస్సున మహారాజు అన్నారు. ప్రజల దీవనలు ఆయనకు ఉండాలన్నారు కార్యక్రమంలో మేయర్‌ చిగిరింత పారి జాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, తీగల రంజిత్‌రెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తాసిల్దార్‌ డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్‌, పెద్ద బావి సుదర్శన్‌ రెడ్డి, రోహిని రమేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, యాతం పవన్‌ యాదవ్‌, శివకుమార్‌, తీగల మాధవి సాయినాథ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షురాలు సిద్దా ల లావణ్య బీరప్ప, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌  యువజన విభాగం అధ్యక్షుడు నాగ నందీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నిమ్మల నరేందర్‌ గౌడ్‌, పెద్ద బావి ఆనంద్‌రెడ్డి, బీమిడి జంగారెడ్డి, బొర్ర జగన్‌ రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.