శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Nov 01, 2020 , 04:50:35

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి మోసపోవద్దు

  • వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో తెలంగాణ నంబర్‌వన్‌ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 
  • పరిగి, దోమ, పూడూరులో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పరిగి : రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం నెం.1 స్థానంలో ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, ఈ దశలో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సూచించినట్లు నియంత్రిత సాగుకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. తద్వారా అన్ని పంటలకు మంచి ధర లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా, రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం మక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కె.నాగారెడ్డి, పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, సర్పంచ్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్‌ వెంకటేశ్‌, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ నాయకులు బి.రవికుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ముకుంద శేఖర్‌, డీసీఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు సంఘం నాయకుడు బాబయ్య తదితరులు పాల్గొన్నారు.  

మద్దతు ధరకు విక్రయించుకోవాలి

పూడూరు : మక్కజొన్న సాగు చేసిన రైతులు పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా సొసైటీ ద్వారా విక్రయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్‌ పి.నవ్యారెడ్డి, జిల్లా సహకార సంఘం అధికారి ఫత్యానాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సురేందర్‌, ఉప సర్పంచ్‌ టి.రాజేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు చెన్నయ్యగౌడ్‌, సురేశ్‌, శ్రీశైలం, వెంకటయ్య, భాస్కర్‌రెడ్డి, సీఈవో జంగయ్య ఉన్నారు.

 కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

దోమ : మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.  మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డితో కలిసి మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్కజొన్న పంటను దళారులకు అమ్మి రైతులు నష్టపోతున్నారని గ్రహించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం మక్కజొన్నల గరిష్ట మద్దతు ధరను క్వింటాలుకు రూ.1850 నిర్ణయించిందని తెలిపారు. పంటలను నిల్వ చేసుకోవడానికి మండల కేంద్రంలో త్వరలోనే రూ.2 కోట్ల వ్యయంతో గోదాం నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శేఖరయ్య, సర్పంచ్‌ రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంతునాయక్‌, రైతు బందు కోఆర్డినేటర్‌ లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, ఎంపీటీసీ నర్సింహులు, మాజీ ఎంపీపీ రాజగోపాలచారి, ఏఈవోలు కావ్వ, దుర్గాప్రసన్న, సహకార బ్యాంకు అధికారి యాదగిరి  పాల్గొన్నారు.