గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 30, 2020 , 07:38:08

ఎస్సీ,ఎస్టీలు ఆర్థికంగా స్థిరపడాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి

ఎస్సీ,ఎస్టీలు ఆర్థికంగా స్థిరపడాలి: మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం : ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా స్థిరపడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా మహేశ్వరం, కందుకూరు, మీర్‌పేట్‌ పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు మహేశ్వరం మండల కేంద్రంలో గురువారం జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ తెలంగాణకే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. సీఎం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు చరిత్రలో నిలుస్తాయని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 334 మందికి 50వేల చొప్పున అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు. మహేశ్వరంలో ఉన్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషిచేస్తానని చెప్పారు. 15,225 మంది ఓనర్‌కం డ్రైవర్ల ఉపాధి కోసం కార్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మహేశ్వరం, కుందుకూరు, మీర్‌పేట్‌ మున్సిపాలిటీల్లో 47 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.24లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునీతాఆంద్యానాయక్‌, ఎంపీడీవో నర్సింహులు, తహసీల్దార్‌ ఆర్‌పీ జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సురసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ మంచె పాండుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కంది అరుణరమేశ్‌, సాలీ వీరానాయక్‌, గుత్తి పద్మపాండు, మోతీలాల్‌ నాయక్‌, మెగావత్‌ రాజునాయక్‌, మద్ది సురేఖ కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు నడికూడి రమేశ్‌, విజయ్‌నాయక్‌, కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ మందజ్యోతి పాండు, ఏపీవో సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ విజయ్‌నాయక్‌ పాల్గొన్నారు.