గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Oct 30, 2020 , 05:49:30

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్‌

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్‌

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.  పరిగిలో గురువారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్‌ చైర్లు, వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు కావాల్సింది సానుభూతి కాదని, ప్రతిఒక్కరూ వారిని గౌరవించి అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల పింఛన్‌ను రూ.3016లకు పెంచి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. 

పరిగి: దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు. గురువారం సామాజిక్‌ అధికారిత శివిర్‌లో భాగంగా పరిగిలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లా డుతూ దివ్యాంగులకు కావాల్సింది సానుభూతి కాదని, ఆత్మగౌరవంతో బతికే జీవ న విధానమని బలంగా నమ్మిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు సైతం ఇచ్చిందన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో   రూ.4కోట్లతో ప్రత్యేక అవసరాలు గల దివ్యాం గులకు ప్రత్యేక జాతీయ పార్కును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే వారిని ప్రొత్సహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 31 జిల్లాల్లో రూ.10కోట్లు  ప్రభుత్వం వారికి అందజేసిందన్నారు.  డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయించినట్టు గుర్తుచేశారు.  కార్పొరేషన్‌ ద్వారా వంద శాతం సబ్సిడీతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు వాహనాలు, బధిరులకు 4జీ స్మార్ట్‌ఫోన్స్‌, అంధులకు స్మార్ట్‌ చేతికర్రలు, ల్యాప్‌టాప్‌లు, ఎంపీ 3 ప్లేయర్స్‌, బ్రెయిలీ కిట్స్‌ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్టు ఎంపీ రంజిత్‌రెడ్డి  వివరించారు. వసతిగృహాలలో  ప్రతిరోజు కోడిగుడ్డు, వారానికి రెండుసార్లు మాంసాహారంతో పౌష్టికాహారం ప్రభు త్వం అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగు లకు  రూ.3016 పింఛన్‌ ఇస్తున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా 10 వీల్‌చైర్‌లు, 30 ట్రై సైకిళ్లు, 20 వినికిడి యంత్రాలు, ఎంఆర్‌ కిట్‌లు మూడు, అంధుల కర్రలు 3, స్మార్ట్‌కీన్‌ ఒకరికి, వంక కర్రలు 30, వాకింగ్‌ స్టిక్స్‌ 20, రొలేటర్‌ ఇద్దరికి, కెప్రొసి కిట్‌ ఒకరికి అందజేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవింద్‌, జడ్పీటీసీ బి. హరిప్రియ, జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, కౌన్సిలర్‌ వెంకటేశ్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి ప్రియదర్శిని, టీఆర్‌ఎస్‌ నాయకులు బి.రవికుమార్‌, అబ్దుల్‌ బషీర్‌, ముకుంద శేఖర్‌  పాల్గొన్నారు.