శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Oct 29, 2020 , 08:54:02

రూ.52కోట్లతో చేప పిల్లల పెంపకం

రూ.52కోట్లతో చేప పిల్లల పెంపకం

బడంగ్‌పేట/తుక్కుగూడ : చెరువుల్లో చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాపూర్‌ పెద్దచెరువు, నాదర్‌గుల్‌ సున్నం చెరువు, అల్మాగడ పోచమ్మ కుంట, తుక్కుగూడ, రావిరాల, మంఖాల్‌ చెరువుల్లో బుధవారం చేప పిల్లలను వదిలారు. బురాన్‌ఖాన్‌ చెరువును మంత్రి సబిత సందర్శించి అందులో 4 లక్షల చేప పిల్లలు వేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం లేని చెరువుల్లో మొత్తం 82 కోట్ల చేపల పిల్లలు వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. చేపల పెంపకంలో తెలంగాణ తీసుకుంటున్న చొరవ ఇతర రాష్ర్టాలనూ ఆకర్షిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, మహేశ్వరం చైర్మన్‌ మధుమోహన్‌ పాల్గొన్నారు.