శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Oct 27, 2020 , 05:47:01

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు

కడ్తాల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముద్విన్‌ గ్రామపంచాయతీకి పలువురు బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, వస్సుల జంగయ్య, శేఖర్‌గౌడ్‌, రంగయ్య, మహేశ్‌ పాల్గొన్నారు.