ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Oct 25, 2020 , 07:18:57

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

కొత్తూరు రూరల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. తెలంగాణ జాగృతి నూతన కమిటీ సభ్యులను శనివారం ఎమ్మెల్యే నివాసంలో టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు పెంటనొళ్ల యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సమక్షంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ జాగృతి మండల కన్వీనర్‌గా మోర కార్తిక్‌రెడ్డి, కోకన్వీనర్‌గా రాజు, మహిళా కన్వీనర్‌గా అమృత, కోకన్వీనర్‌గా అనిత, యూత్‌ కన్వీనర్‌గా ఏబీ. శ్రీనివాస్‌యాదవ్‌, కోకన్వీనర్‌గా శ్రీనివాస్‌గౌడ్‌, విద్యార్థి విభాగం మండల కన్వీనర్‌గా బాబురావు, కోకన్వీనర్‌గా హరిప్రశాంత్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా జాగృతి మండల కన్వీనర్‌ కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలను అప్పజెప్పిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరికి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కొత్తూరు మాజీ సర్పంచ్‌ జగన్‌, మాజీ ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్‌, నాయకులు రమేశ్‌నాయక్‌, శ్రావణ్‌కుమార్‌, దేవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.