సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 25, 2020 , 07:07:38

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

 రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కడ్తాల్‌ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో పూర్తైన రైతు వేదికను శనివారం జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు సంఘటితం కావడానికి సీఎం కేసీఆర్‌ రైతు వేదికల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. పంటలసాగు, ఏయే ఎరువులు వాడాలి, తాము పండించిన పంటలకు మార్కెటింగ్‌ చేసుకోవడానికి, మద్దతు ధరను నిర్ణయించుకోవడానికి రైతు వేదికలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.  నియోజకవర్గంలో 42 రైతు వేదికల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే వాటిన్నంటిని రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వ్యవసాయానికి 24 కరెంట్‌, రైతుబంధు, రుణమాఫీతో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. మండల కేంద్రంలో అన్ని హంగులతో, నాణ్యతతో రైతు వేదిక నిర్మించిన సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డిని ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీనరసింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ వీరయ్య, ఉప సర్పంచ్‌ రామృష్ణ, జిల్లా నాయకులు చందోజీ, లాయక్‌అలీ, గంప శ్రీను, జహంగీర్‌అలీ, గణేశ్‌గౌడ్‌, అశోక్‌, రాంచంద్రయ్య, వెంకటేశ్‌, శ్రీను, తిరుమలేశ్వర్‌, సేవ్యానాయక్‌, వెంకటయ్య, ఇర్షాద్‌, తదితరులు పాల్గొన్నారు.