గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Oct 22, 2020 , 05:44:54

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

పరిగి : ప్రజారోగ్యంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సొంత డబ్బులతో అందజేసిన అంబులెన్స్‌ను బుధవారం పరిగిలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 100 అంబులెన్స్‌లు అందజేశారని తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అందజేసిన మరో అంబులెన్స్‌ను పరిగి నియోజకవర్గంలో సేవలు అందించేందుకు వినియోగిస్తామని చెప్పారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినపుడు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు, గాయాలపాలైనవారిని దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే రూ.5కోట్లతో పరిగిలో దవాఖాన నూతన భవనం నిర్మాణం చేపట్టామని, దసరా తర్వాత ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్లు వెంకటయ్య, భాస్కర్‌, వైద్యాధికారి డాక్టర్‌ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, కౌన్సిలర్లు కృష్ణ, వెంకటేశ్‌, సర్పంచ్‌లు అశోక్‌వర్ధన్‌రెడ్డి, జగన్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రవికుమార్‌, తాహెర్‌అలీ పాల్గొన్నారు.