గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 22, 2020 , 05:34:36

కష్టాల వరద

కష్టాల వరద

  • కూలిన ఇండ్లు.. పాడైన పంటలు
  • పరిశీలనకు రంగారెడ్డి జిల్లాకు నేడు కేంద్రబృందం రాక
  • నష్టం వివరాలు సిద్ధం చేసిన అధికారులు
  • 24 మంది మృత్యువాత.. ముగ్గురు అదృశ్యం, మరో ఇద్దరికి గాయాలు 
  • 1,15,402 ఎకరాల్లో పంట నష్టం
  • 396 ఆస్తులు డ్యామేజు ..15 ఇండ్లు నేలమట్టం 
  • 34  పునరావాస కేంద్రాల్లో 4720 మంది.. 

భారీవర్షానికి రంగారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. పలు గ్రామాల్లో  ఇండ్లు నేలమట్టం కాగా, పంటలు నీట మునిగాయి.  నష్టాన్నిపరిశీలించేందుకు కేంద్రబృందం గురువారం జిల్లాకు రానున్నది. ఈ  నేపథ్యంలో అధికారులు నష్టం వివరాలను సిద్ధం చేశారు.  మొత్తం 396 ఆస్తులు ధ్వంసం కాగా.. అందులో 15 ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇక 24 మంది మృతిచెందగా ముగ్గురు గల్లంతయ్యారు. 1,15,402 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 34 పునరావాస కేంద్రాలకు 4720 మందిని తరలించి కనీస వసతులు కల్పించారు. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో భారీ వర్షాలకు పంటలన్నీ నీటమునిగాయి. వాణిజ్య పంటలతో పాటుగా కూరగాయల పంటలతో పాటు ఇతర ఆస్తి నష్టం వాటి ల్లింది. జిల్లాలో 27 మండలాలు ఉంటే ఆరు అర్బన్‌ మం డలాలు ఉన్నాయి. 21 మండలాల్లో పంటలు, ఆస్తులతో పాటుగా ఆరు అర్బన్‌ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ఆస్తులు, ఆప్తులను కోల్పోయారు. చాలా మండలాల్లో పత్తి, వరి, కంది, కూరగాయలు, ఆకు కూర పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఈ ఏడాది 4.22 లక్షల ఎకరాల పంట సాగైం ది. ఇందులో 33% పత్తి, 37.65% వరి, 10.15% కంది, మక్క జొన్న 7.81% పంటలు దెబ్బతిన్నాయి. నీళ్లలో పంట మునగడం, గింజ రాలడం, ఇసుక మేటలేయడం, రంగు మారడం వంటి తదితర కారణాలతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 445 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది.వరి 24,525 ఎకరాల్లో పత్తి 82, 870, కంది 6303, మక్కజొన్న 1503, జొన్న 192, చెరుకు తొ మ్మిది ఎకరాల్లో మొత్తం 1, 15, 402 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. బాధితులుగా 82,749 మంది రైతులను గుర్తించారు. కాగా 457 ఎక రాల్లో ఆకుకూరలు, ఇతర కూరగాయ పంటలు నీట మునిగినట్లు అధికారులు బుధవారం ప్రకటించా రు.160 గ్రామాల్లో వరదలు వ చ్చాయని 24,780 మంది ఇ బ్బం దులు ఎదుర్కొన్నట్లు వెల్లడిం చారు. ఈ వరద లో 24 మంది మృత్యువాత పడగా ముగ్గురు గల్లంతు, మరో ఇద్ద రికి తీవ్ర గాయాలైన ట్లు ప్రకటించారు. 32 చెరువులు పొంగిపొర్లుతు న్నా యి.126 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. 396 ఆస్తులు డ్యామేజ్‌ కాగా..15 ఇండ్లు పూర్తి కూలిపోయాయి. 2038 మూగ జీవాలు మృతి చెందాయి. 34 ప్రాంతాల్లో పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేయగా ఐదువేల మంది ఆశ్ర యం పొందు తున్నట్లు పేర్కొన్నారు. 11,543 మందికి రిలీఫ్‌ మెటీ రియల్‌ అందజేశారు. ఈ నేపథ్యంలో నేడు  అర్బన్‌ ప్రాంతా ల్లో  కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉన్నందున  భారీ వర్షాల వలన కలిగిన జిల్లాలో జరిగిన నష్టం వివరాలను సిద్ధం చేసి ఉంచారు.