గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 21, 2020 , 05:53:03

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అబ్దుల్లాపూర్‌మెట్‌ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్‌ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్‌ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ,  రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా చైర్మన్‌ వంగేటి లక్ష్మారెడ్డి, ఏఈవో కల్యాణి, సర్పంచ్‌ సురకంటి వనజశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ అనితమహేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్‌ ఉన్నారు.

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌  భరోసా 

ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాలకు చెందిన బాధితులకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ రూ.32వేలు, పార్వతమ్మ రూ.39వేలు, ఉప్పరిగూడ గ్రామానికి చెందిన తౠల్ల సాయి రూ.32వేలు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని ఎన్‌.కృష్ణారెడ్డికి రూ.60వేలు, యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన శివకు రూ.52వేల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఈ సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.