గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 21, 2020 , 05:16:20

పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం...

పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం...

పాడిరైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కడ్తాల్‌ మండలం చల్లంపల్లి, తలకొండపల్లి మండలం చంద్రదానలో ఏర్పాటు చేసిన పాలశీతలీకరణ కేంద్రాలను మంగళవారం విజయ డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.  

ఆమనగల్లు:  వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తూ కర్షకులకు తోడ్పాటునందిస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర విజయడెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలంలోని చంద్రదాన గ్రామంలో మినీ పాలశీతలీకరణ కేంద్రాన్ని చైర్మన్‌ లోకభూమారెడ్డి, సర్పంచ్‌ బక్కికుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడిపరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలకు పెద్దఎత్తున్న రాయితీలు ప్రకటించి యువ రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తున్నదని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోప్షన్‌ సభ్యుడు రహ్మాన్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి,మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు దశరథ్‌నాయక్‌ పాల్గొన్నారు.

చల్లంపల్లిలో రూ.కోటితో బీఎంసీ ప్రారంభం

కడ్తాల్‌: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో రూ.కోటితో నిర్మించిన బీఎంసీ (పాలశీతలీకరణ కేంద్రం) కేంద్రాన్ని పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డీడీ ధన్‌రాజ్‌, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ కృష్ణయ్యయాదవ్‌తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ  పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం సబ్సిడీపై ఆవులు, బర్రెలు, మందులను పంపిణీ చేస్తున్నదని చెప్పారు. అనంతరం విజయ డెయిరీ సంస్థ ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తుల ప్రదర్శనను  తిలకించి, బీఎంసీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. 

చైర్మన్‌కు వినతుల వెల్లువ 

విజయ డెయిరీ చైర్మన్‌ లోకభూమారెడ్డికి పలువురు పాడి రైతులు, నాయకులు వినతులు సమర్పించారు. కడ్తాల్‌ పట్టణంలోని పాడి రైతులు సబ్సిడీపై ఆవుల కోసం డీడీ కట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుందని ఉప సర్పంచ్‌ రామకృష్ణ, పాల ప్రోత్సాహక ధరకు సంబంధించిన బిల్లులు రావడంలేదని నాయకులు నర్సింహా, భీక్యానాయక్‌, వెంకటేశ్‌, లక్ష్మయ్య, యాదయ్యలు లోకభూమారెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని లోకభూమారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

గాంధీజీ విగ్రహాల ఆవిష్కరణ  

మండలంలోని చల్లంపల్లి, వంపుగూడెం గ్రామాల్లో లియో క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గంప శ్రీను ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాలను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, జడ్పీటీసీ విజితారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్లు అర్జున్‌రావు, వీరయ్య, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు తులసీరాంనాయక్‌, హరిచంద్‌నాయక్‌, విజయలక్ష్మి, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, గోపాల్‌, మంజుల, ఉప సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, రామకృష్ణ, వినోద్‌, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్‌ రాధిక, పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, లాలయ్యగౌడ్‌, వాణిశ్రీ, నాయకులు సుదర్శన్‌రెడ్డి, లాయక్‌అలీ, రాజేందర్‌యాదవ్‌, శంకర్‌, రమేశ్‌, శివ, రాఘవచారి, వెంకట్‌యాదవ్‌, ప్రవీణ్‌, రాములుగౌడ్‌, దామోదర్‌రెడ్డి, వెంకటేశ్‌, నాయకులు పాల్గొన్నారు.