సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Oct 18, 2020 , 00:28:17

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటాం

మంత్రి సబితాఇంద్రారెడ్డి పలు కాలనీల్లో పర్యటన

బడంగ్‌పేట, అక్టోబర్‌17: ఆందోళన వద్దు అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మామిడిపల్లి ఇంద్రమ్మ కాలనీలో తెగిపోయిన నాలాను మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌,  కార్పొరేటర్లు శివకుమార్‌, యా తం పవన్‌ యాదవ్‌ తదితరులతో కలిసి ప రిశీ లించారు. అనంతరం రాయల్‌ కాలనీలో  పర్యటించారు. వర్షాలు తగ్గినా ఇంకా వరద ఉధృతి తగ్గలేదని కాలనీ వాసులు  తెలిపారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. చెరువులు పూర్తిగా నిండి పోవడంతో అలుగు పారుతున్నాయన్నారు. దీంతో కాలనీలకు వరద ముప్పుతప్పడం లేదన్నారు.  వర్షం తగ్గగానే రోడ్లు, డ్రైనేజీ పనులు చేయిస్తామన్నారు. ఏ కాలనీకి పోయినా ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూ చిం చారు. ఇండ్ల నుంచి బ యటకు రా వాలని పరిస్థితి ఉన్న వారికి ఆహా రం సరఫరా చేయాలని అధికారులను ఆదే శిం చారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పనిచేస్తున్నామన్నారు. చాలా కాలనీలలు ఇప్పటికీ వరద నీటిలో ఉన్నాయన్నారు. ఇబ్బంది కరంగా ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు పోవాలన్నారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేసి ప్రజలకు చేయూత నివ్వాలన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు పూర్తిగా తగ్గితేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కార్పొరేటర్లు యాతం పవన్‌ యాదవ్‌, శివకుమార్‌,పెద్ద బావి సుదర్శన్‌రెడ్డి,  పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజక వర్గం బీసీ సెల్‌ అధ్యక్షుడు నిమ్మల నరేందర్‌గౌడ్‌, యువజన విభాగం అధ్యక్షుడు నాగ నందీశ్వర్‌రెడ్డి, నాయకులు పెద్ద బావి ఆనంద్‌రెడ్డి, భీమిడి జంగారెడ్డి, సంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్‌రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, జనిగ శ్రీనివాస్‌, సిల్వేరు సాంబ శివ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.