గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 18, 2020 , 00:28:17

అర్హులందరూ ఓటు హక్కును పొందండి

అర్హులందరూ ఓటు హక్కును పొందండి

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

షాద్‌నగర్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ కుచకుల్లా దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం షాద్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గడువులోపు అర్హులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కుపైనా గ్రామీణ స్థాయిలో సైతం అవగాహన కల్పించాలని పార్టీశ్రేణులకు సూచించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతుదారులకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల పూర్తి వివరాలు సేకరించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.