సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 17, 2020 , 07:57:39

వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

బండ్లగూడ : వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు  అప్ప చెరువు తెగి వరద ప్రవాహంలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ బాధిత కుటుంబ సభ్యులను కలిసి అండగా ఉంటామని భరోసా కల్పించారు.  ఒక్కొక్కరికీ ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలో ఇండ్లు కోల్పోయిన వారికి నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సరికొండ వెంకటేశ్‌, యాసిన్‌ అయ్యూబి, తలారి శ్రీశైలం పాల్గొన్నారు.