ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Oct 17, 2020 , 00:27:53

గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ

గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ

కడ్తాల్‌: బాలాజీనగర్‌ పంచాయతీలో  సర్పంచ్‌ కమ్లీబిచ్చానాయక్‌తో కలిసి శుక్రవారం ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ మహిళలకు చీరెలు అందజేశారు. పండుగ పూట పేదలందరూ ఆనందంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వమే చీరెలను అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ వీరయ్య, చల్లంపల్లి సర్పంచ్‌ కృష్ణయ్యయాదవ్‌, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, మంజుల, ఉప సర్పంచ్‌ రమేశ్‌, నాయకులు మోత్యానాయక్‌, రమేశ్‌, సేవ్యా, పాండు పాల్గొన్నారు.

చీరెలు అందజేసిన కౌన్సిలర్లు

ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో కొంగరకలాన్‌, రాందాస్‌పల్లిలో శుక్రవారం కౌన్సిలర్లు  గోపగల్ల మహేందర్‌, కంతి సంధ్య మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని అన్నారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ నాయకుడు కంతి దయాకర్‌  పాల్గొన్నారు.