శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Oct 16, 2020 , 08:07:13

ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం

ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం

  • బాధిత కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్‌
  • మంత్రి సబితాఇంద్రారెడ్డి

బడంగ్‌పేట, అక్టోబర్‌ 15 : వరద విపత్తుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని విధాలా ఆదుకుంటారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌ గ్రీన్‌ హోమ్స్‌ కాలనీ, కుర్మల్‌ గూడ, మీర్‌పేట, బడంగపేట ముంపు ప్రాంతాల్లో గురువారం ఆమె పర్యటించారు. మీర్‌పేట పెద్దచెరువు, అల్మాస్‌గూడలోని కోమటికుంటను పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరింత నష్టం తప్పిందన్నారు. అధికారులు, ఎన్‌డీఆర్‌ఎప్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులు నిద్ర లేకుండా పనిచేస్తున్నారని అభినందించారు. బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కార్పొరేటర్లు సునీతాశ్రీకాంత్‌ గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, ఇంద్రసేనా, కో ఆప్షన్‌ సభ్యుడు మర్రి జగన్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.