సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 16, 2020 , 02:16:09

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి

అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి

  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

కులకచర్ల: ప్రభుత్వం అన్ని వర్గాల అభున్నతికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌, చౌడాపూర్‌, మందిపాల్‌ గ్రామాల్లో గురువారం డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మహిళలకు సీఎం కేసీఆర్‌ అన్న పాత్రను పోషిస్తున్నారన్నారు. మండల పరిధిలోని మక్తవెంకటాపూర్‌, మందిపాల్‌ గ్రామాల్లోని 49 సర్వే నంబర్‌లో భూములు ఉన్నవారికి ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.  వర్షానికి నష్టపోయిన రైతులు ఆందోళన చెందకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. త్వరలోనే చుట్టపక్కల గ్రామాలతో చౌడాపూర్‌ మండలంగా ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పీఏసీఎస్‌ ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చౌడాపూర్‌లో పీఏసీఎస్‌ సబ్‌ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఎంపీటీసీ శంకర్‌, సర్పంచ్‌లు కొత్తరంగారెడ్డి, మఠం ప్రమీల, చిలుకల సత్యమ్మ, ఉపసర్పంచ్‌ శివకుమార్‌, నాయకులు రాజప్ప, రాజశేఖర్‌, పులిరాములు, వెంకట్‌, నర్సింహులు, కృష్ణయ్య, శంకరయ్య పాల్గొన్నారు.