శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Oct 16, 2020 , 02:14:04

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం

  • వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌           
  • బతుకమ్మ చీరెలు పంపిణీ

మర్పల్లి : కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజాసంక్షేమం ఆగకుండా పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నదని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. మండలం పరిధి కోట్‌మర్పల్లిలో గురువారం ఆయన సర్పంచ్‌ విజయలక్ష్మీరాచయ్యతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల  అభివృద్ధే లక్ష్యంగా డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కోట్‌మర్పల్లి నుంచి చిట్టేంపల్లికి లింకు రోడ్డు నిర్మించాలని సర్పంచ్‌ విజయలక్ష్మి రాచయ్య, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘుపతిరెడ్డి ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా విన్నవించారు. ఈ రోడ్డు నిర్మాణంతో వికారాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి దూరభారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు సోహెల్‌, ఎంపీటీసీ సుజాత వెంకట్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ అంజిరెడ్డి, ప్రభాకర్‌గుప్తా, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నాయబ్‌గౌడ్‌, గ్రామ అధ్యక్షుడు రాచయ్య, వార్డు సభ్యుడు జైహింద్‌రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

రాంపూర్‌లో..

కోట్‌పల్లి : మండలంలోని రాంపూర్‌లో గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనితాగోపాల్‌రెడ్డి, ఎంపీపీ నల్లొల్ల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనీల్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్‌, వైస్‌ ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు. 

మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి : చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల రూరల్‌ : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలం పరిధి ముడిమ్యాల పంచాయతీలో సర్పంచ్‌ స్వర్ణలతాదర్శన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్‌ దసరా కానుకలు అందజేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మద్దెల శివనీలచింటు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్‌, ముడిమ్యాల ఉప సర్పంచ్‌ జహీరీబేగం, ఎంపీటీసీ సూర్యాపేట స్వరూప, ఎంపీడీవో హరీశ్‌కుమార్‌, కార్యదర్శి రియాజుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.