సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Oct 15, 2020 , 02:03:52

జలవిలయం..

జలవిలయం..

రంగారెడ్డి/వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి, వికా రాబాద్‌ జిల్లాలవ్యాప్తంగా జలవిలయం సృష్టించింది. మంగళ వారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతె రిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో గ్రామీ ణ, అర్బన్‌ ప్రాంతాల్లోని వాగులు, వంకలు, ఇతర జలాశయా లు పొంగిపొర్లాయి. మూసీ-ఈసీ వాగులు ఉధృతంగా పారా యి. భారీ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు హిమాయత్‌ నగర్‌ గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు వదిలారు. భారీ వర్షంతో పత్తి, వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రధానమైన మూసీ, ఈసీ నదులు ప్రమా దకరస్థాయిలో ప్రవహించాయి. 20 ఏండ్ల  తర్వాత మళ్లీ (గండిపేట, హిమాయత్‌సాగర్‌) జంట జలాశయాల్లో వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఒక్కరోజే 29 సెంటీమీటర్లు, సరాసరి 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురి సింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండ లంలో 17 సెంటీమీటర్ల వర్షం పడింది. శంకర్‌పల్లి మండలం ఫత్తేపూర్‌లోని మూసీ వద్ద వరదలో చిక్కుకున్న ఇద్దరిని అగ్ని మాపక సిబ్బంది, శంకర్‌పల్లి పోలీసుల నేతృత్వంలో అధికారులు బోట్ల ద్వారా క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. కలెక్టర్‌ అమ య్‌కుమార్‌ జిల్లా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

ప్రాణ నష్టం లేకుండా చర్యలు.. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణ నష్టం లేకుం డా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లాలో నాలుగు చెరువులు తెగిపోయాయని, వాటిని పున రుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 11 చెరువులు నిండి ప్రవహిస్తుండటంతో సమీప ప్రజలకు నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌- కర్నూలు జాతీయ రహదారి దెబ్బతింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి.. జిల్లాలో నిరాశ్రయులైన వారి కోసం 5 క్యాంపులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లోకి 272మందిని తరలించామన్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలోని వారు క్యాంపుల్లోకి రావాలని సూచించారు.  మహేశ్వరం నియో జకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పర్యటించారు.

‘ వెయ్యి మంది ఆకలి తీర్చిన ఎంపీ రంజిత్‌రెడ్డి

‘మీర్‌పేట్‌, బండగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇండ్లలోకి నీరు చేరి వంట చేసుకోలేని వెయ్యిమందికి తన డబ్బులతో ఆహార పొట్లాలను అందజేశారు. అల్మాస్‌గూడలో వర్షం కారణంగా గుం డెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని తన భుజంపై తీసుకుని ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ఎంపీ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగ కుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. గర్భిణులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించా లని మైక్‌లో సూచించారు.  

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి..

జిల్లాలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. 040-23230813, 040-23230817 నెంబర్‌లను సంప్రదించా లని సూచించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అధి కారులు సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం షెల్టర్‌ లను ఏర్పాటు చేస్తున్నారు. ఫంక్షన్‌హాల్‌లు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలలో వరద బాధితులకు ఆశ్రయం కల్పించి, సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు.  

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. ముగ్గురు మృతి..!

గగన్‌పహాడ్‌ వద్ద హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్ప చెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు.  

జలదిగ్బంధంలో హైవేలు 

భారీ వర్షాల దెబ్బకు నగర శివారు అతలాకుతలమైంది. ఇప్ప టికే రోడ్లన్నీ ఎక్కడికక్కడ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆరాం ఘర్‌ జంక్షన్‌ దాటి హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ రోడ్డు (ఎన్‌హెచ్‌- 44) రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అబ్దుల్లాపూ ర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహ దారిపై ఉధృతంగా వర్షపు నీరు ప్రవహించింది. లష్కర్‌గూడ లో వాగులో కారులో ఉన్న  ఇద్దరూ గల్లంత య్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఒక మృతదేహం దొరికింది. విమానాశ్రయం జాతీయ రహదారి 44 కర్నూల్‌ - షాద్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలన్నీ విమానాశ్రయం నుంచి ఎన్‌హెచ్‌ -44కు వెళ్లడానికి ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లారు. 

జిల్లాలోని 22 మండలాల్లోని 288 గ్రామాల పరిధిలో పంట లు నీట మునిగాయి. పంటలు నీళ్లలో మునిగిపోయాయి. 9232 ఎకరాల్లో వరి, 14,793ఎకరాల్లో పత్తి, 1500 ఎక రాల్లో కంది, 104ఎకరాల్లో మక్క, 4 ఎకరాల్లో చెరుకు తదితర పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 25,633 ఎకరాల్లో 17,022 మంది రైతులు పంట నష్టపోయినట్లు గుర్తించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ప్రమాదకరస్థాయిలో  నదులు

వికారాబాద్‌ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మరోవైపు ఈదురుగాలులకు జిల్లాలోని పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లతోపాటు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలోని ప్రధానమైన మూసీ, కాగ్నా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. 20 ఏండ్ల తర్వాత మళ్లీ మూసీ నదిలో వరద ప్రవాహం ఇంత పెద్దఎత్తున వచ్చింది. అదేవిధంగా కాగ్నా నదిలో భారీ వరదతో ఉగ్రరూపం దాల్చింది. నవాబుపేట మండలంలోని ఎక్‌మామిడిలో ఇల్లు నేలకూలడంతో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా కాగ్నా నది భారీ ప్రవాహంతో బషీరాబాద్‌ మండలం జీవన్గి, పెద్దేముల్‌ మండలం ఇందూరు గ్రామాలు నీటమునిగాయి. అంతేకాకుండా భారీ వర్షంతోపాటు ఈదురుగాలులతో వరి, కంది పంటలు నేలకొరుగగా, పత్తిపంట నీట మునిగింది. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌ అధికారులను జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఏదైనా అనుకొని ప్రమాదం సంభవించిన, కష్టాల్లో ఉన్నవారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకుగాను జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధికంగా మర్పల్లి, మోమిన్‌పేట్‌, బంట్వారం, నవాబుపేట, పెద్దేముల్‌, బషీరాబా ద్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అయితే మర్పల్లి మండలంలో అత్యధికంగా 16.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

ప్రమాదకరంగా ప్రవహించిన కాగ్నా, మూసీ నదులు...

జిల్లాలో ప్రధాన మూసీ, కాగ్నా నదులు ప్రమాదకరంగా ప్రవహించాయి. మూసీ నదిలో భారీ వరద నీటి ప్రవాహంతో నవాబుపేట మండలంలో పలు గ్రామాల్లో రవాణా స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కాగ్నా నది కూడా భారీ ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం స్తంభించింది. కాగ్నా నది రెండు వైపులా కిలోమీటరు మేర ప్రవహించడం ఇదే తొలిసారి అని పరివాహక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా కాగ్నా పొంగి ప్రవహిస్తుండడంతో తాండూర్‌-మహబూబ్‌నగర్‌, తాండూరు-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు స్తంభించాయి. 

కాగ్నా నది ప్రవాహంతో బషీరాబాద్‌ మండలంలోని జీవన్గి, నవాన్గి, తాండూరు మండలం వీరశెట్టిపల్లి, చిట్టిఘణాపూర్‌, పెద్దేముల్‌ మండలంలోని ఇందూరు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. బషీరాబాద్‌ మండలం జీవన్గిలో శివాలయం వరద నీటికి మునిగిపోయింది. కోట్‌పల్లి, జుంటుపల్లి, లక్నాపూర్‌, సర్పన్‌పల్లి, శివసాగర్‌ చెరువులు నిండుకుండలా మారాయి. 

పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి, ధారూర్‌ మండలం స్టేషన్‌ ధారూర్‌ వద్ద తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోవడంతో 50 గ్రామాల జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించింది. మోమిన్‌పేట్‌ మండల కేంద్రం సమీపంలోని చిలుకవాగు పొంగిపొర్లడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. బొంరాసుపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు నిండి బీజాపూర్‌ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది. మర్పల్లి మండలంలోని బిల్‌కల్‌, కొత్లాపూర్‌, సిరిపురం, పంచలింగాల్‌ వాగులు పొంగిపొర్లడంతో రవాణా స్తంభించింది. తాండూరు మండలం ఖాంజాపూర్‌ గ్రామంలో భారీ వర్షానికి పొలం వద్ద గల షెడ్డులోకి పూర్తిగా వరద నీరు రావడంతో అందులో ఉన్న రెండు ఎద్దులు, ఒక ఆవు మృతిచెందాయి. 

కంట్రోల్‌ రూం ఏర్పాటు...

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అన్ని మండలాల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాగ్నా, మూసీ నదులు భారీగా ప్రవహిస్తుండడంతో పరివాహక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వరద ప్రవాహం పెరిగినట్లయితే వీరశెట్టిపల్లి గ్రామంలోని 500 మంది ప్రజలను తాండూర్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలం కర్నాటక సరిహద్దు ప్రాంతమైన క్యాద్గిరా వద్ద కర్నాటక ప్రాంతంలో కాగ్నా వాగులో నలుగురు కర్నాటక వాసులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు కర్నాటక పోలీసులు రెస్క్యూ బృందాలతో ప్రయత్నిస్తున్నారు. ఏదైనా అనుకొని ప్రమాదం సంభవించినా, ఆపదొచ్చిన జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపదొస్తే 6305954956 కంట్రోల్‌ రూం నెంబర్‌ను సంప్రదించవచ్చు. 

 74938 ఎకరాల్లో పంట నష్టం 

వికారాబాద్‌: జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలో 74938 ఎకరాల్లో పంట నష్టం కలిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వీటిలో కంది పంట 19833 ఎకరాల్లో, పత్తి పంట 48874