గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 06, 2020 , 00:14:31

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి

  • బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలి
  • డబుల్‌ బెడ్రూం నిర్మాణాల్లో వేగం పెంచండి
  • ఈజీఏస్‌ కింద ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
  • భూగర్భ జలాలను పెంపొందించడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి
  • రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి
  • ఖైరతాబాద్‌ జడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా విరివిగా రుణాలు అందించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి స్థాయీ సంఘ సమావేశంలో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ... బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు అందించి పరిశ్రమలను స్థాపించేందుకు చర్య లు తీసుకోవాలని పరిశ్రమలశాఖ అధికారులకు సూచించారు. గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ రెండు పడకల ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలన్నా రు. కొత్త స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందించాలని, ఈజీఏస్‌ కింద ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న మధ్యతరహా రైతులను ఎంపిక చేసి గ్రూపులుగా ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లను అందించాలని ఆదేశించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పత్తి, వరి కొనుగోలు నిమిత్తం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభు త్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని రైతులకు భరోసా కల్పించాలని తెలిపారు. విద్యా, వైద్యస్థాయి సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కొవిడ్‌-19 దృష్ట్యా ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయని విద్యార్థులు హాజరవుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థులు ఇతర మాధ్యమాల ద్వారా క్లాసులకు హాజరయ్యేలా చూడాలన్నారు. కరోనా వ్యాప్తిని నిరోదించేందుకు ప్రజల్లో విసృత్త అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్‌ భయంతో గుండె నొప్పులు వస్తున్నాయని దీనిపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్నారు. మహిళ సంక్షేమం, పనులు, ప్రణాళిక, ఆర్థిక, స్థాయిసంఘ సమావేశాలు చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జరిగాయి. సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.