శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Oct 06, 2020 , 00:14:00

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట..

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట..

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి దిక్సూచిలా మారిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి  అన్నారు. సోమవారం షాబాద్‌ మండల కేంద్రంలోని పహిల్వాన్‌ చెరువు కట్టపై రూ. 1.25 కోట్లతో సీసీ రోడ్డు, రూ. 50లక్షలతో నిర్మించిన పీఏసీఏస్‌ నూతన భవనం, రూ. 20లక్షలతో కేశవగూడలో సీసీ రోడ్డు పనులను జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని దుర్గం చెరువులాగా ఇక్కడి పహిల్వాన్‌ చెరువును అభివృద్ధి చేసి బోటింగ్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉన్న షాబాద్‌ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ దివాలాతీసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత జడ్పీటీసీ, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీలపైనే ఉందని తెలిపారు.

- షాబాద్‌

షాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పహిల్వాన్‌ చెరువుకట్టపై రూ.1.25 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.50లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ నూతన భవనం, రూ.20లక్షలతో కేశవగూడలో సీసీ రోడ్డు పనులను ఎంపీ  రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్‌  చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం పహిల్వాన్‌ చెరువు బతుకమ్మ ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయ పథకం మంచి సక్సెస్‌ అయ్యిందన్నారు. రూ.30వేల కోట్లతో రాష్ట్రంలో చెరువులను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై 22 రాష్ర్టాల మంత్రులు చర్చించినట్లు గుర్తు చేశారు. చందనవెళ్లిలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్స్‌లో నిరుద్యోగ యువ తకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సొంత ఖర్చులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి విద్యార్హతకు తగిన ఉద్యోగాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌దర్శన్‌ పథకం ద్వారా రానున్న ఐదేండ్లలో షాబాద్‌ పహిల్వాన్‌ చెరువును పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నగరంలోని దుర్గం చెరువు మాదిరిగా ఇక్కడి పహిల్వాన్‌ చెరువును అభివృద్ధి చేసి బోటింగ్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంపీ నిధులతో ఆయా గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లా పరిషత్‌  చైర్‌ పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా షాబాద్‌ మండలానికి మంచి గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు ధీటుగా షాబాద్‌లో మినీట్యాంక్‌ బండ్‌ ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు అందించే ప్రతి రూపాయి వారి ఇంటికి చేరుతుందన్నారు. జిల్లా పరిషత్‌ నిధులతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ చందనవెళ్లి టెక్స్‌టైల్స్‌ పార్కుతో షాబాద్‌కు కొత్త కళ వచ్చిందన్నారు. పహిల్వాన్‌ చెరువుకు 400 ఏండ్ల చరిత్ర ఉందని, ఈ చెరువు నిండితే ఆయకట్టు కింద 4 వేల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేసుకుంటారని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఈ చెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.7కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. షాబాద్‌ మండల ప్రజలను ఎప్పటికీ మరిచిపోమని, వారికి నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. రైతులు ఎట్టి పరిస్థితు ల్లో భూములు అమ్ముకోవద్దని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉన్న ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. పక్కనే ఉన్న చిల్కమర్రి వాగును పహిల్వాన్‌ చెరువులోకి మళ్లించి ఎల్లప్పుడూ చెరువులో నీరు ఉండేలా,  వ్యవ సాయం సస్యశ్యామలం అయ్యేలా కృషి చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి వికారాబాద్‌, తాండూరు, పరిగి ప్రాంతాలతో పాటు మొదటగా షాబాద్‌ మండ లానికి నీరు వస్తుందన్నారు. ఆ నీటితో పహిల్వాన్‌ చెరువును నింపుతామన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ 70 ఏండ్ల కాలంలో చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ చేసి చూపిస్తున్నారన్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.  గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత గ్రామస్థాయిలో సర్పంచ్‌, ఎంపీటీసీలది, మండలస్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీలపైనే ఉంటుందన్నారు. జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ పహిల్వాన్‌ చెరువు అభివృద్ధితో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెర వేరిందన్నారు. గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు భవనాల నిర్మాణా నికి నిధులు మంజూరు చేయాలని, కొన్నిగ్రామాలకు మిగిలిపోయిన బీటీ రోడ్లు వేయిం చేం దుకు కృషి చేయాలని కోరారు. 

కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతి, వైస్‌ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌, పీఏసీఏస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మద్దూరి మల్లేశ్‌, షాబాద్‌ సర్పంచ్‌ తమ్మలి సుబ్రమణ్యేశ్వరి, ఎంపీటీసీ గుండాల అశోక్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఏఈ  లు శ్రీదివ్య, నిఖేష్‌, విద్యాసాగర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఎంఏ మతీన్‌, కోట్ల మహేందర్‌రెడ్డి, శేరిగూడెం వెంకటయ్య, జడల రాజేందర్‌గౌడ్‌, పోన్న నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కవిత, కేతన, దర్శన్‌, నర్సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, కృష్ణ గౌడ్‌, ఎంపీటీసీలు సునీత, మధుకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.