బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Oct 05, 2020 , 01:23:50

తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు షురూ

తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు షురూ

కందుకూరు, అక్టోబర్‌ 4 : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఫర్నిచర్‌, పలు వసతుల కల్పనకు సిద్ధమువుతుంది. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలనే సంకల్పంతో నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తాసిల్దార్‌ కార్యాలయాల్లో చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో మండల స్థాయిలో వసతులు సమకూరుస్తున్నారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్‌, ఆమనగుల్లు, తలకొండపల్లి, బాలాపూరు,సరూర్‌నగర్‌ మండలాల్లో ఎంత మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మండల స్థాయి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ కార్యాకలాపాలు నిర్వహించేందుకు ప్రతి తహసీల్దార్‌ కార్యాలయానికి ఒకరిద్దరు డాక్యుమెంట్‌ రైటర్లను నియమించే అవకాశం ఉంది. 

పనులు చేపడుతున్నాం

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవన్యూ చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. డివిజన్‌ పరిధిలోని ఏడు మండ లాల్లో వ్యవసాయ భూములను తాసిల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అందుకు కావాల్సిన స్కానర్లు, ప్రింటర్లు కంప్యూటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను చేపడుతున్నాం. అన్ని మండలాల్లో తహసీల్దార్లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

                                             -సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో కందుకూరు