సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Oct 05, 2020 , 01:23:30

ఆస్తి వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

ఆస్తి వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ రామారావు

మొయినాబాద్‌ : రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఇంటి ఆస్తులకు మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతాయని, వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ రామారావు అన్నా రు. మొయినాబాద్‌ మండలం జీవో 111 పరిధిలో ఉండడం తో కొన్ని గ్రామ పంచాయతీలలో నిర్మాణాలు లేకుండా వాటికి  ఇంటి నంబర్‌ ఇస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు ఆయన ఆదివారం అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, చిలుకూ రు, చందానగర్‌, పెద్దమంగళారం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు ఇచ్చిన ఇంటి నంబర్ల వివరాలను తెలుసుకుని నేరుగా ఆ ఇండ్లకు వెళ్లి ఇంటి నంబర్‌లను తనిఖీ చేశారు. వారి తనిఖీలో ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టిన ఇండ్లకు మాత్రమే ఇంటి నంబర్‌ ఇచ్చిన ట్లు తేలింది. ఇంటి నంబర్‌లకు సంబంధించిన రికార్డులను ఆయ న పరిశీలించారు. ఇం టి నిర్మాణం లేకుండా ఎట్టి పరిస్థితిలో డోర్‌ నంబర్‌ ఇవ్వడానికి వీలు లేదని, అలాంటి చర్యలకు పాల్పడిన వారు బాధ్యులవుతారని పేర్కొన్నారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి నిర్మాణానికి రోడ్‌ నంబర్‌ ఇవ్వడంతోపాటు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన యాప్‌లో నమోదు చేయాలన్నారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆప్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటివరకు డోర్‌ నంబర్‌ ఇవ్వకుండా రికార్డులో లేని ఇంటి ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రి య వేగవంతం జరుగాలంటే నేరుగా నిర్మాణం వద్దకు వెళ్లి వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు కాకపోతే భవిషత్తులో వాటి క్రయ విక్రయాలు జరుగవని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయబడిన ఆస్తులకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్‌లు జరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం నూతన విధానంను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. డీఎల్‌పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీవో సురేందర్‌రెడ్డి, అజీజ్‌నగర్‌ సర్పంచ్‌ సంధ్యశ్రీశైలం, చిలుకూరు సర్పంచ్‌ గునుగుర్తి స్వరూప, చందానగర్‌ సర్పంచ్‌ సత్తమ్మ, పెద్దమంగళారం సర్పంచ్‌ నరోత్తంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు దీపలత, రాఘవేందర్‌, మల్లేశ్‌, శివ పాల్గొన్నారు.