గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 03, 2020 , 04:47:34

సీతాకోకలు.. బతుకమ్మ చీరల పంపణీకి ఏర్పాట్లు .!

సీతాకోకలు.. బతుకమ్మ చీరల పంపణీకి ఏర్పాట్లు .!

287 రకాల బతుకమ్మ చీరలు..

18 సంవత్సరాలు నిండిన మహిళలందరికి అందజేత

4.96 లక్షల మంది తీసుకునే అవకాశం 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : బతుకమ్మ చీరల పంపిణీకి రంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడబిడ్డలకు దసరా కానుకగా అందించాలని సీఏం కేసీఆర్‌ గత నాలుగేండ్ల క్రితం దీనికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలకు ప్రజలు అత్యంత వైభవంగా జరు పుకుంటారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహి ళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదీ నుంచి మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమర్‌ ఆదేశాలు జారీ చేశారు. సమావేశాల అనంతరం మండ లాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆయా మండలాల ప్రత్యేక అధికారులు బతుకమ్మ చీరల పంపిణీ పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్‌ల వారీగా, గ్రా మాల వారీగా ఎంపీడీవోలు ఇన్‌చార్జీ అధికారులను నియమించారు. 9వ తేదీ నుంచి 14వ తేదీ లోపు బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందించనున్నా రు. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ఇంటింటికి వెళ్లి చీరలు పంపిణీ చేయ నున్నారు.  టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు.18 సంవత్సరాలు నిండిన మహిళలందరికి బతుకమ్మ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జిల్లాలో మొత్తం 919 రేషన్‌ షాపుల పరిధిలో 4.96లక్షల మందికి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొయినాబాద్‌ మండల పరిషత్‌ కార్యాయలంలో ఉన్న గోదాంలో బతుకమ్మ చీరల స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. 287 రకాల బతుకమ్మ  చీరలను భద్ర పర్చారు.  

దసరా పండుగకు ముందు నుంచే బతుకమ్మ చీర పంపిణీకి రంగం సిద్ధ మైంది. వారం రోజుల ముందే నిర్వహించే సద్దుల బతుకమ్మకు జిల్లాలో చీర ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ, అర్బన్‌ మం డ లాల్లో వీటిన్ని పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి 27 మండలాలల్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు చీరను అందించేం దుకు రంగం సిద్ధం చేశారు. ఒక్కో గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉన్నది. ఇప్పటికే గ్రామాల వారీగా జాబితా ఆయా రేషన్‌ డీలర్ల దగ్గరకు చేరింది. బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. చేనేత కార్మికులను ఆదుకోవడంతో పాటు మహిళలకు దసరా బతుకమ్మ పండుగ పర్వ దినం కానుకగా చీరలను అందించేందుకు కార్యచరణ రూపొందించారు. చేనేత చీరలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ప్రభుత్వం నిరుపేదలకు పండుగ కానుకగా అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాలకు బతుకమ్మ చీరలను అందించనున్నారు. ఈ నెల సద్దుల బతుకమ్మ పండుగ ఉండటంతో అంతుకు ముందే చీరలను మహిళలకు అం దించాలని ప్రభు త్వం అనుకుంటుంది. రూ. కోట్లు ఖర్చు చేసి చేనేత కార్మికులు, సంఘాల నుంచి చీరలను ఇప్పటికే కొనుగోలు చేసింది. సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆహార భద్రత కార్డులను ఎంతమందికి ఇచ్చిందనే సమాచారం సేకరించి ప్రభుత్వం వాటి ఆధారంగా మహిళలకు చీరలను అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా  5,24,868 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 

 అర్హులు 4.96 లక్షల మంది

18 ఏళ్లు నిండిన యువతులతో పాటు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు.  2019 అర్హత ప్రకారం ప్రస్తుతం 4.96 లక్షల మంది అర్హులని అధికారులు గుర్తించారు.  అయితే గతేడాది 4.20లక్షల మంది మహిళలు మాత్రమే బతుకమ్మ చీరలను తీసుకున్నారు. మిగిలిన చీరలను స్టాక్‌ గోదాంకు తిప్పి పంపించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా అంచనాలు వేశారు. అందరూ బతుకమ్మ చీరలు తీసుకునే అవకాశం ఉంటే వారి కూడా అంది ంచేందుకు జిల్లా డీఆర్‌డీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

 27 మండలాలల్లో 5,24,868 రేషన్‌ కార్డులు.. 

జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా సుమారుగా 5,24,868 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అందులో ఆంత్యోదయ ఆహార భద్రత కార్డులు (ఏఎఫ్‌ఎస్‌సీ) 35 వేల 170లు, ఆహార భద్రత కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 4లక్షల 89వేల 656, అన్నపూర్ణ కార్డులు 42 చొప్పున ఉన్నాయి. బతుకమ్మ చీరలను జిల్లాలోని తెల్లరేషన్‌కార్డులున్నవారికి ఇవ్వాలని నిర్ణయించారు. 5,24,868 రేషన్‌ కార్డులకు గాను దాదాపుగా జిల్లాలో 919  రేషన్‌ సరుకుల దుకాణాలున్నాయి. ఇప్పటికే తహసీల్దార్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు, వీఆర్వోలు ఇతర అనుబంధ శాఖల అధికారులు ముమ్మరం చేశారు. అందరికి చీరలకు సంబంధించిన టోకన్లు సైతం అందజేశారు. 

 చీరలు ఇవ్వడం సంతోషకరం

నాలుగు సంవత్సరాల నుంచి మహిళలకు బతు కమ్మ చీరలు ఇవ్వడం సంతోషకరం. ఈ ఏడాది కూడా పెద్దఎత్తున కరోనా ఉన్నప్పటికీ మహిళ లను పండుగ సమయంలో సంతోషంగా చూడా లని ప్రభుత్వం చీరలను పంపిణీ చేయడం గర్వ కారణం.                           -కొందూటి మహేశ్వరి కౌన్సిలర్‌ షాద్‌నగర్‌

పండుగ వేళ బతుకమ్మ చీర

ప్రతి సంవత్సరం దసరా పండుగకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది.  బతుకమ్మ చీరల పంపిణీ దేశంలో ఎక్కడా లేదు. ప్రతి మహిళ సంతోషాన్ని కోరుకునే ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌. 

-చెట్ల పావని కౌన్సిలర్‌ షాద్‌నగర్‌