గురువారం 22 అక్టోబర్ 2020
Rangareddy - Oct 02, 2020 , 00:57:45

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరుగా గురువారం రాజేంద్రనగర్‌ తాసీల్దార్‌ కార్యాలయంలో  తన పేరును నమోదు చేసుకున్నారు. తాను అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుండి వెటర్నరీ డిగ్రీ పొంది పట్టభద్రులు అయ్యారో అదే ప్రాంతంలో తన పేరును మొదటి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఫారం-18 దరఖాస్తును పూర్తి చేసి తాసీల్దార్‌ చంద్రశేఖర్‌కు అందజేశారు. అంతకు ముందు రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి నివాలర్పించారు. అదే విధంగా ఎంపీ సతీమణి సీతారంజిత్‌రెడ్డి కూడా అదే కారాయలయంలో ఫార్మ్‌-18 దరఖాస్తు పూర్తి చేసి తాసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్‌ అసోసియోషన్‌ అధ్యక్షుడు కటమ్‌ శ్రీధర్‌ ఉన్నారు. 

 అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

తాండూరు: రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సంబధిత పత్రాలను అధికారులకు అందజేసి తన ఓటును నమోదు చేసుకున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఓటు నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రావుఫ్‌, కౌన్సిలర్లు రజాక్‌, విజయదేవి, రాఘవేందర్‌, రాము, రవిరాజు, ముక్తార్‌, టీఆర్‌ఎస్‌ నేతలు రాజుగౌడ్‌, పి.నర్సింహులు, బాల్‌రెడ్డి, మసూద్‌, జుబేలాల, రాకేశ్‌, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. 

ఓటు నమో దు   కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల: పట్టభద్రులు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు నమోదుపై ఇంటింటికి తిరిగి పట్టభద్రులను చైతన్యపరుస్తామన్నారు. 2017 సవంత్సరం కంటే ముందు డిగ్రీ ఉతీర్ణులైనవారిని ఓటరుగా నమోదు చేయించాలని నాయకులకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ కర్నె ప్రసాద్‌, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, మండల కార్యదర్శి ప్రభాకర్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శివరెడ్డి, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు మోసిన్‌, గిరిధర్‌రెడ్డి, జంగారెడ్డి,  జాఫర్‌, శ్రీకాం ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకులు చొరవ తీసుకోవాలి..

శంకర్‌పల్లి : పట్టభద్రులతో ఓటు నమోదు చేయించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు చొరవ తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్‌పల్లిలోని మాజీ సర్పంచ్‌ సాత ఆత్మలింగం కార్యాలయంలో పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్‌, రమేశ్‌రాథోడ్‌, కోఆప్షన్‌ సభ్యుడు గోల్లాడు మహమూద్‌, మాజీ ఉప సర్పంచ్‌ సాత ప్రవీణ్‌కుమార్‌, నాయకులు పార్శి బాలకృష్ణ, ఉపేందర్‌రెడ్డి, సాత  రాఘవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో..

కొత్తూరు రూరల్‌: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో  పట్టభద్రుల ఓటరు నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో చేగూరు పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ పద్మారావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భీమయ్య, టీఆర్‌ఎస్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు రాఘవేందర్‌, నాయకులు సత్యనారాయణ, లింగంనాయక్‌, జనార్దన్‌చారి, రమేశ్‌, బోకుల శ్రీరాములు, బి.రాజు  పాల్గొన్నారు.  

వేగవంతం చేయాలి

కొందుర్గు : పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కొందుర్గు వైస్‌ ఎంపీపీ రాజేశ్‌పటేల్‌ అన్నారు. మండల కేంద్రం, గంగన్నగూడ, చెర్కుపల్లి గ్రామాల్లో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం పత్రాలను సేకరించారు. అలాగే జిల్లెడు చౌదరిగూడ మండలంలోని కాస్లాబాద్‌, ఫీర్జాపూర్‌, రావిర్యాల తదితర గ్రామాల్లో పట్టభద్రులు నింపి ఇచ్చిన ఓటు నమోదు ఫారాలను టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హఫీజ్‌ తాసిల్దార్‌ రాములుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, దీమ గణేశ్‌, ప్రతాప్‌రెడ్డి, రాము, జాంగీర్‌, మల్లెశ్‌, గోపాల్‌రెడ్డి, సుందర్‌, మాణెయ్య, శేఖర్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ కష్టపడాలి

ఇబ్రహీంపట్నం : దేశానికి దిశానిర్దేశం చూపే పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని, ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ నుంచి భారీ మెజార్టీని తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి నాయకుడు, కార్యకర్త తమ చుట్టుపక్కల ఉన్నవారు, తమ బంధువుల్లో ఎవరైనా పట్టభద్రులున్నా ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ సత్తువెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు సుల్తాన్‌, బానుబాబు,  బాలరాజు, కసరమోని పద్మ, బర్ల మంగ, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భరత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మంఖాల దాసు, నిట్టు జగదీశ్వర్‌, జానిపాషా, వేణు చీరాల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కులకచర్ల: పట్టభద్రులు తమ ఓటు హక్కులు నమోదు చేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో పీఏసీఎస్‌ కార్యాలయంలో స్వేరోస్‌ సర్కిల్‌ జిల్లా అధ్యక్షుడు తుప్పలి అశోక్‌కుమార్‌తో మొదటగా ఓటును నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్‌, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు శేరి రాంరెడ్డి, హరికృష్ణ, మాలె కృష్ణయ్య, చుక్కయ్య, జెట్టి గళ్ల వెంకటయ్య, తిర్మలాపూర్‌ రాములు, చిన్నయ్య, పులెందర్‌, తదితరులు పాల్గొన్నారు.

పట్ట భద్రుల ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం 

నవాబుపేట: పట్టభద్రుల ఓటర్లను అధిక సంఖ్యలో నమోదు చేయించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునితామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పట్ట భద్రుల ఓటర్ల నమోదు కేంద్రాన్ని చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గ్రామీణ  పట్ట పట్టభద్రులకు సాంకేతిక  ఇబ్బందులు ఉంటాయని, దీంతో ఓటరు నమోదు కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.  అధికార పార్టీ అభ్యర్థి ఎవరైనా విజ యాన్ని చేకూర్చడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాలె భవాని, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, స్థానిక సర్పంచ్‌ విజయలక్ష్మి, ఎంపీటీసీ పద్మనాగిరెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు చిట్టెపు మల్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

 ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి

 బషీరాబాద్‌: ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్‌ కార్యాలయంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటును నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌-ఉమ్మడి రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత నర్సిరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు నర్సింహులు, సర్పంచ్‌లు సాబేర్‌, శివ, దశరథ్‌, నాయకులు రామునాయక్‌, శివప్రసాద్‌, రాజారత్నం, గోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, రజాక్‌, నరేష్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆనంద్‌ దంపతులు పత్రాలు అందజేత

వికారాబాద్‌రూరల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగానూ  పట్టభద్రులందరూ తమ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ సూచించారు. గురువారం ఎమ్మెల్యే ఆనంద్‌, ఆయన సతీమణి సబిత వికారాబాద్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ రవీందర్‌కు ఓటరు నమోదుకు కావాల్సిన ఆధార్‌కార్డు, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌, ఓటర్‌ఐడీకార్డు, ఫొటోలు సమర్పించారు. ఆ తర్వాత టీఎస్‌ఈడబ్ల్యూఐసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులందరూ ఓటరు నమోదు కోసం పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ ఓటు హక్కుకోసం గురువారం వికారాబాద్‌ మండలంలో మొత్తం 16 మంది  పత్రాలు అందించారు. 


logo