బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 25, 2020 , 01:42:33

సైబర్‌ నేరాల నియంత్రణకు కలిసి పని చేద్దాం

సైబర్‌ నేరాల నియంత్రణకు కలిసి పని చేద్దాం

  • గూగుల్‌ ప్రతినిధులతో సీపీ సజ్జనార్‌ సమావేశం 

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: గూగుల్‌ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసాలను అరికట్టేందుకు గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గూగుల్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నంబర్లు, గూగుల్‌ ప్రకటన సర్వీసుల ఫ్రాడ్స్‌, యూట్యూబ్‌లో ఉన్న అశ్లీల, అభ్యంతకరమైన అంశాలను తొలిగించాలని కోరారు. జీమెయిల్‌ ఐపీ లాగ్స్‌, యూట్యూబ్‌ చానెల్స్‌, గూగుల్‌ పే వివరాలను దర్యాప్తు సందర్భంలో అవసరం ఉన్నప్పుడు పోలీసులకు అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై గూగుల్‌ సాంకేతిక బృందం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దీని కోసం ప్రత్యేక చర్యలను చేపట్టాలని సీపీ కోరారు. సైబర్‌ నేరాలు జరుగకుండా సాంకేతిక కంచెను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గూగుల్‌ ప్రతినిధులు గీతాంజలీదుగ్గల్‌, సునీతా మహంతి, దీపక్‌ సింగ్‌, సైబరాబాద్‌ క్రైం డీసీపీ రోహిణిప్రియదర్శిని, ఏసీపీ క్రైమ్స్‌ శ్యాంబాబు,పోలీసు అధికారులు పాల్గొన్నారు.logo