ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 25, 2020 , 01:42:30

ఎంబీబీఎస్‌ ఫ్రీ సీటు సాధించిన రెడ్డి విద్యార్థినికి ఆర్థిక సాయం

ఎంబీబీఎస్‌  ఫ్రీ  సీటు సాధించిన రెడ్డి విద్యార్థినికి ఆర్థిక సాయం

సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: సేవా రంగంలో రెడ్డి ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఎప్పుడు ముందుంటుందని అసోసియేషన్‌ ఫౌండర్‌ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుళ్ల గ్రామానికి చెందిన విద్యార్థిని సుప్రియారెడ్డి  మెడికల్‌ ఫలితాల్లో  ఉచితంగా ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. సుప్రియారెడ్డి పేద రెడ్డి కుటుంబానికి చెందడంతో ఎంబీబీఎస్‌ చదువు ఖర్చుల నిమిత్తం రెడ్డి ఉమెన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థినికి లక్షా 20 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం సుప్రియారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రెడ్డి ఉమెన్స్‌ అసోసియేషన్‌ ద్వారా పేద రెడ్డి విద్యార్థులకు నిరంతరం అండగా ఉంటామన్నారు. లక్షా 20 వేలలో నార్నీఫౌండేషన్‌ నుంచి డాక్టర్‌ నోముల నర్మదారెడ్డి రూ.35 వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు మందడి జ్యోతిరెడ్డి, చెర త్రివేణిరెడ్డి, నందికొండ గీతారెడ్డి, మోతె కవితారెడ్డి, కొమ్మిడి శోభారెడ్డి, చల్లమల్ల లావణ్యరెడ్డి, కోడూరు దుర్గాభవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.