ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Sep 25, 2020 , 01:41:59

కొత్త చట్టం..కొండంత సంబురం

కొత్త చట్టం..కొండంత సంబురం

  • కొత్త రెవెన్యూ చట్టం..చరిత్రలో నిలిచిపోతుంది...
  • సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి..
  • నూతన చట్టంతో రైతాంగానికి ఊరట..
  • రెవెన్యూ అంటే ఇప్పటివరకు ఆదాయం... ఇకనుంచి సంక్షేమం
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 
  • మధ్యతరగతి ఆస్తులకు పూర్తి రక్షణ
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 

కొత్త రెవెన్యూ చట్టానికి జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఐదువందలకు పైగా ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. జై కేసీఆర్‌... జై జై టీఆర్‌ఎస్‌.. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగగా, రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా నూతన చట్టం అమలవుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ          దేశానికి వెన్నుముకైన వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.         - తాండూరు


తాండూరు: తెలంగాణ రైతాంగానికి నూతన రెవెన్యూ చట్టం గొప్ప ఊరట కలిగిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం తాండూరులో రెవెన్యూ చట్టానికి మద్ధతుగా ఐదు వందలకు పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీని నిర్వహించారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి సబితారెడ్డి టీఆర్‌ఎస్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 

విలేమూన్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్‌స్టేషన్‌ చౌరస్తా, వ్యవసాయమార్కెట్‌, గాంధీచౌక్‌, భద్రేశ్వర్‌చౌక్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశం వరకు చేరుకుంది. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, రైతులు క్షీరాభిషేకం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు రెవెన్యూ అంటే ఆదాయం.. ఇకపై రెవెన్యూ అంటే సంక్షేమం అనేది సాక్షాత్కరిస్తుందన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా నూతన చట్టం తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో ప్రతి రైతుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టంతో మధ్యతరగతి ఆస్తులకు పూర్తి రక్షణ కలుగుతుందన్నారు. ఇకముందు ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపైకి ఇంచుభూమి మారాలన్నా ధరణి పోర్టల్‌ ద్వారానే జరుగుతుందని చెప్పారు.

 కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రావుఫ్‌, తాండూరు జెడ్పీటీసీ మంజుల, బషీరాబాద్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, జిల్లా పశుగనాభివృద్ధి చైర్మన్‌ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పురుషోత్తంరావు, రవిగౌడ్‌, లక్ష్మారెడ్డి, మురళిగౌడ్‌, నర్సింహులు, అజయ్‌ప్రసాద్‌, విఠల్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.