సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 16, 2020 , 06:10:40

పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి

పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి

  • మార్కెటింగ్‌, వ్యవసాయ, సీసీఐ అధికారులతో రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సమీక్ష 

ంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని రైతులు పండించే పత్తి కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆమయ్‌ కుమార్‌ మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పత్తి కొనుగోలుపై మార్కెటిం గ్‌, వ్యవసాయ, సీసీఐ అధికారులతో సమీక్షా సమావేశం ని ర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమా ర్‌ మాట్లాడుతూ..జిల్లాలో 2.5లక్షలకు పైగా ఎకరాల్లో రైతు లు పత్తి సాగుచేస్తున్నారని, పత్తి కొనుగోలుకు గాను 15 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేశామన్నారు. ఆయా మిల్లులను గ్రామాలకు కేటాయించి పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. రైతులకు టోకెన్లను జారీ చేసి ఎలాంటి గొడవలు జరుగకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల, రైతుల వారీగా పంట వివరాలను సేకరించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. పత్తి కొనుగోలు చేసిన తర్వాత స్టాక్‌ తరలింపునకు, గోదాముల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు

. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, మా ర్కెటింగ్‌ శాఖ జిల్లా మేనేజర్‌ ఛాయాదేవి, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గీత, సీసీఐ, రవాణా, తూనికల, కొలతలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

పల్లెల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

 గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆమయ్‌కుమార్‌ ఎంపీడీవోలు, ఎంపీవోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలతో పల్లె ప్రకృతి వనాలు, హరితహా రం, వైకుంఠ ధామాల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్ట ర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 867 గ్రామా లు, అనుబంధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల నిర్మాణం, మొక్కల నాటే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠ ధామాలకు భూ స మస్యలు ఉన్న గ్రామాల్లో సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు

. వైకుంఠ ధామాల నిర్మాణాల్లో అలసత్వం వహించే సర్పంచులపై చర్యలు తీసుకుంటామన్నారు. 867 గ్రామాలకు గాను 735 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు భూములను గుర్తించడం జరిగిందన్నారు. అందులోని 490 గ్రామాల్లో పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన గ్రామాల్లో పనులను చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు భూములను గుర్తించిన గ్రా మాలకు సంబంధించి వెంటనే భూములను గుర్తించి ఎంపీడీఓలకు అప్పజెప్పాలని తాసిల్దార్లను ఆదేశించారు.

పల్లె ప్రకృతి వనాల్లో 4 వేల మొక్కలు నాటే లక్ష్యం.. కాగా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని నాటాలని, వెయ్యి మొక్కలు ఉన్నా నాటేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, జడ్పీ సీఈవో జితేందర్‌ రెడ్డి, డీపీవో శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్‌డీవో ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.