శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 16, 2020 , 00:50:41

టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి

టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి

  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పార్టీని బలోపేతం దిశగా నడిపించాలని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించేందుకు కృషిచేయాలని కోరారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు తమ ఓట్లను నమోదు చేయించుకునేలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ఉన్నత ఆశయంతో రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు.

ఇటీవల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంతో ఇకపై భూ సమస్యలు తొలిగిపోనున్నందున.. ఎక్కడైనా రైతులకు సమస్యలుంటే వాటిపై అవగాహన కల్పించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి పాల్గొన్నారు.