సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 12, 2020 , 00:11:16

సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరం

  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
  • కడ్తాల్‌ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

కడ్తాల్‌ : సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందినవారికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శుక్రవారం జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌తో కలిసి ఆయన అందజేశారు.  అన్మాస్‌పల్లికి చెందిన సరోజనమ్మకు రూ.53వేలు, పెద్దారెడ్డి చెరువు తండాకు చెందిన సీతకు రూ.12వేలు, చల్లంపల్లి గ్రామానికి చెందిన నరేశ్‌యాదవ్‌కు రూ.30వేలు,  గాన్గుమార్ల తండాకు చెందిన శ్రీకాంత్‌కు రూ.14వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ కృష్ణయ్యయాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సేవ్యానాయక్‌, నాయకులు శ్రీనునాయక్‌, భీమన్‌, రాజు, గణేశ్‌ పాల్గొన్నారు.

మాడ్గుల: నిరుపేదల వైద్యానికి  సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండలంలోని ఇర్విన్‌ గ్రామానికి చెందిన భార్గవికి రూ.12వేలు, అలివేలుకు రూ.18వేలు, కిరణ్‌కు రూ.12 వేలు, ఆర్కపల్లికి చెందిన లింగంకు రూ.8వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరైంది. ఆ చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల మండల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ప్యాక్స్‌ డైరక్టర్‌ సత్తిరెడ్డి, ఇర్విన్‌ సర్పంచ్‌ పుష్పలతజంగయ్యయాదవ్‌, చంద్రాయణపల్లి సర్పంచ్‌ యాదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు జంగయ్యయాదవ్‌, వెంకటయ్యగౌడ్‌, శివరాజ్‌గౌడ్‌, వరుణ్‌కుర్మ,  మల్లేశ్‌యాదవ్‌, యాదయ్య, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తలకొండపల్లి : మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన స్వాతికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ నుంచి రూ.23వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ శుక్రవారం బాధితురాలి  కుటుంబ సభ్యులకు అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటుందన్నారు.