బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 12, 2020 , 00:11:18

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పరిగి టౌన్‌ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పరిగి పోలీస్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పూడురు మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన గోపాల్‌ తన అత్తగారి గ్రామమైన దోమ మం డలం దిర్సంపల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం వెళ్లాడు. గురువారం ఉదయం బయటకు వెళ్లొస్తానని చెప్పి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో భార్య లక్ష్మి గోపాల్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసింది.

దీంతో కు టుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువులు, తెలిసిన వారికి ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకున్నా ఎక్కడా జాడ తెలియలేదు. శుక్రవారం పరిగి మండలం రంగంపల్లి గ్రామ శివార్లలో గుర్తు తెలియని శవం కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్లూస్‌టీంను రప్పించి ఆనవాలు గుర్తించేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన వ్యక్తి రాకంచర్లకు చెందిన గోపాల్‌గా గుర్తించిన పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతు డి కాళ్లకు విద్యుత్‌షాక్‌ తగిలినట్లుగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పరిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.