గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Sep 11, 2020 , 00:19:44

కొత్త మున్సిపాలిటీగా కొత్తూరు

కొత్త మున్సిపాలిటీగా కొత్తూరు

  • తిమ్మాపూర్‌, కొత్తూరు గ్రామాల్లో వెల్లువెత్తిన సంబురాలు
  • ఎమ్మెల్యేకు ఘన స్వాగతం  పలికిన ప్రజలు
  • అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెరుగుతుందన్న ఎమ్మెల్యే
  • ప్రజలందరూ సహకరించాలని వినతి
  • అంతిరెడ్డిగూడను ప్రత్యేక గ్రామపంచాయతీగా చేసేందుకు యత్నిస్తున్నట్టు వెల్లడి  

కొత్తూరు రూరల్‌: మున్సిపాలిటీతో కొత్తూరు మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం సీఎం కేసీఆర్‌ కొత్తూరు, తిమ్మాపూర్‌ గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ప్రకటించడంతో గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పెంటనోల్ల యాదగిరి ఆధ్వర్యం లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పటాకులు, బ్యాండు మేళంతో కొత్తూరు వై జంక్షన్‌ నుంచి కొత్తూరు పూలే చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. కొత్తూరు వై జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహానికి, అంబేద్కర్‌ విగ్రహానికి, కొత్తూరు చౌరస్తాలోని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామాలభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదన్నారు. మున్సి పాలిటీలకు ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయన్నారు. నిధులతో కొత్తూరును మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. గతంలో కొత్తూరు, తిమ్మాపూర్‌ గ్రామాలు ఒకే గ్రామపంచాయతీగా ఉండేవని తిరిగి నేడు తిమ్మాపూర్‌, కొత్తూరు గ్రామాలు ఏకం కావడం విశేషమన్నారు. అందుకు తిమ్మాపూర్‌, కొత్తూరు గ్రామస్తులు సహకరించాలన్నారు. నందిగామ మండలపరిధిలోని అంతిరెడ్డిగూడ గ్రామాన్ని సైతం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు,

అందుకు ఎంతో కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కొడిచర్లతండా, మల్లాపూర్‌, మక్తగూడ, గూడూరు, మల్లాపూర్‌తండా సర్పంచ్‌లు సంతోశ్‌నాయక్‌, సాయిలు, రాజు, సత్తయ్య, రవినాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సత్యనారాయణ, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ జగన్‌, మాజీ ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ మెండె కృష్ణయ్యయాదవ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భీమయ్య, నాయకులు క్రాంతిరెడ్డి, లింగం నాయక్‌, గోపాల్‌నాయక్‌, రవినాయక్‌, రాఘవేందర్‌యాదవ్‌, జె. శివ, బండి శ్రావణ్‌, జనార్దనాచారి, జైపాల్‌, దామోదర్‌రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.