మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 11, 2020 , 07:22:37

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకాలు

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకాలు

  • కొత్త చట్టంపై  హర్షాతిరేకాలు
  •  సంబురాలు చేసుకున్న వీఆర్‌ఏలు

ఊరూ.. వాడా తేడాలేకుండా సంబురాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కొత్త రెవెన్యూ చట్టంతో సమస్యలు తీరిపోనున్నాయంటూ పటాకులు కాలుస్తూ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. యాచారం మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో రైతుబంధు జిల్లా చైర్మన్‌ వంగేటి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో  రైతులు తమ అభిమానాన్ని చాటారు. మొయినాబాద్‌, ధారూరు మండలం మోమిన్‌కలాన్‌ తదితర చోట్ల ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ..పేస్కేలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా యాచారం, నందిగామ తాసిల్దార్‌ కార్యాలయాల ఎదుట వీఆర్‌ఏలు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. - నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌